Reading Time: 2 minutes

ట్రంప్ ఎన్నికల గాలం ..మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో గెలిపిస్తే.. ఒక్కొక్కరికి 5 వేల డాలర్లు!

Caption of Image.
  •  అమెరికన్‌‌‌‌లకు ప్రెసిడెంట్ ‘ట్రంప్ డివిడెండ్’ 
  • కాంగ్రెస్‌‌‌‌లో మెజార్టీ వస్తే ఇస్తామని హామీ
  • ఎన్నికల తర్వాత ఇరాన్ యుద్ధం ముగుస్తుందని కామెంట్  

డల్లాస్: అమెరికాలో నవంబర్‌‌లో జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ విజయం సాధించి కాంగ్రెస్‌‌పై పట్టు నిలుపుకుంటే, దేశంలోని ప్రతి వయోజన పౌరుడికీ 5వేల డాలర్ల (భారత కరెన్సీలో సుమారు రూ. 4 లక్షలకు పైగా) నగదు అందజేస్తామని ప్రెసిడెంట్‌‌ డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు.

 డల్లాస్‌‌లోని అమెరికన్ ఎయిర్‌‌లైన్స్ సెంటర్‌‌లో జరిగిన రిపబ్లికన్ల మధ్యంతర ఎన్నికల సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ పథకానికి ‘ట్రంప్ డివిడెండ్’ అని పేరు పెడతామని ప్రకటించారు. ఈ హామీ అమలైతే దాదాపు 1 ట్రిలియన్ డాలర్లకు పైగా ప్రజాధనం వెచ్చించాల్సి ఉంటుంది.

 అయితే ఈ నిధులు ఎక్కడి నుంచి సమీకరిస్తారనే విషయంపై స్పష్టత ఇవ్వని ట్రంప్, ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా ఉందని, దేశంలోకి భారీగా ఆదాయం వస్తోందని చెప్పుకొచ్చారు. బ్యాలెట్ పేపర్‌‌పై తన పేరు లేకపోయినా, తానే స్వయంగా బరిలో ఉన్నానని భావించి ఓటేయాలని మద్దతుదారులను కోరారు. 

ఇరాన్ యుద్ధాన్ని గట్టిగా సమర్థించుకున్నారు. యుద్ధంలో విజయం సాధించగానే చమురు ధరలు భారీగా తగ్గుతాయని, హార్మూజ్‌‌ జలసంధికి తన పేరు పెట్టాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఒకవేళ డెమోక్రాట్లు గెలిస్తే అమెరికా కమ్యూనిస్ట్ దేశంగా మారిపోతుందని ఆయన హెచ్చరించారు.  

పుతిన్, జెలెన్​స్కీ ద్వేషించుకుంటున్నరు..

రష్యా అధ్యక్షుడు పుతిన్‌‌, ఉక్రెయిన్​ ప్రెసిడెంట్​ జెలెన్‌‌ స్కీ ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారని, అందుకే పీస్‌‌ డీల్‌‌ నిలిచిపోతున్నదని ట్రంప్‌‌ పేర్కొన్నారు.  ఎయిర్‌‌ఫోర్స్ వన్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘పుతిన్ ఒక ఒప్పందానికి రావాలని ఆశిస్తున్నారు. జెలెన్‌‌స్కీ కూడా అందుకు ముందుకొస్తే పరిస్థితులు చక్కబడతాయి” అని పేర్కొన్నారు.

ఎన్నికల తర్వాత ఇరాన్ యుద్ధం ముగుస్తుంది 

యూఎస్ మధ్యంతర ఎన్నికలు ముగియగానే ఇరాన్‌‌తో కొనసాగుతున్న యుద్ధం ముగుస్తుందని ట్రంప్‌‌ అన్నారు. ప్రస్తుతం ఇరాన్ పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారిందని, ఆ దేశం ఎక్కువ కాలం యుద్ధాన్ని కొనసాగించలేదని స్పష్టం చేశారు. 

అమెరికా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు ఇరాన్ యత్నిస్తోందని ఆరోపించారు. వాషింగ్టన్‌‌లో బలహీన  ప్రభుత్వం ఏర్పడితే, తమ అణు కార్యక్రమాన్ని కొనసాగించవచ్చనే ఇదంతా చేస్తోందని విమర్శించారు.  
 
అమెరికాలో నవంబర్‌‌‌‌లో జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీని గెలిపించి కాంగ్రెస్‌‌‌‌లో మెజారిటీ అందిస్తే.. దేశంలో ప్రతి వయోజన పౌరుడికీ 5 వేల డాలర్లు(రూ. 4 లక్షలకు పైగా) అందజేస్తామని ప్రెసిడెంట్‌‌‌‌ డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. 

డల్లాస్‌‌‌‌లో బుధవారం రిపబ్లికన్ల మధ్యంతర ఎన్నికల సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ పథకానికి ‘ట్రంప్ డివిడెండ్’ అని పేరు పెడతామని ప్రకటించారు. ఈ హామీ అమలైతే దాదాపు ట్రిలియన్ డాలర్లకు పైగా ప్రజాధనం వెచ్చించాల్సి ఉంటుంది. 
 
 

©️ VIL Media Pvt Ltd.