Reading Time: < 1 minute

వినాయక చవితి ముందు కుప్పకూలిన గోల్డ్ అండ్ సిల్వర్.. హైదరాబాద్ రేట్లివే

Caption of Image.

గడచిన వారం రోజులుగా పెరుగుతూ సాధారణ కొనుగోలుదారులకు చుక్కలు చూపించిన బులియన్ మార్కెట్లు వినాయక చవితికి ముందు కుప్పకూలాయి. పదుల రూపాయల్లో కూడుండా వేలల్లో ఒక్కసారిగా ధరలు పడిపోవటం వీకెండ్ షాపర్లకు ఒక శుభపరిణామంగా చెప్పుకోవచ్చు. ఎవరైనా తెలుగు రాష్ట్రాల ప్రజలు షాపింగ్ చేయాలనుకుంటున్నట్లయితే ముందుగా తమ నగరాల్లోని తగ్గిన ధరలను పరిశీలించటం బెటర్. 

సెప్టెంబర్ 11న బంగారం రేట్లు భారీగా తగ్గాయి. సెప్టెంబర్ 10 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా రూ.262 తగ్గుదలను నమోదు చేసింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 289గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 015గా కొనసాగుతోంది. 

ALSO READ : పర్యావరణ పరిరక్షణకు గూగుల్ 5 ప్రాజెక్టులు

శుక్రవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. సెప్టెంబర్ 11, 2026న దేశవ్యాప్తంగా కేజీకి రూ.10వేలు తగ్గిపోయింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.10వేలు తగ్గి రూ.2లక్షల 45వేలుగా ఉంది. అంటే గ్రాము దాదాపు రూ.245 దగ్గర ఉంది.

©️ VIL Media Pvt Ltd.