Reading Time: 3 minutes
సెప్టెంబర్ 12 రాశిఫలాలు.. ఈ రాశులకు కెరీర్‌లో పురోగతి, ఆర్థిక లాభాలు!

దిన ఫలాలు (సెప్టెంబర్ 12, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో సొంత ఆలోచనలు బాగా అనుకూలిస్తాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు బాగా చక్కబడతాయి. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం సానుకూలంగా గడిచిపోతుంది. వృత్తి, వ్యాపారాలు పురోగతి సాధిస్తాయి. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికారులతో సామరస్యం ఏర్పడుతుంది. అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, వ్యాపారాల్లో మార్పులు చేపట్టి, లాభాల బాట పట్టిస్తారు. ఉద్యోగంలో కూడా సొంత ఆలోచనలు బాగా అనుకూలిస్తాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు బాగా చక్కబడతాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందడం, బాకీలు వసూలు కావడం వంటివి జరుగుతాయి. కుటుంబ, వ్యక్తిగత ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. బంధువుల ద్వారా ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగ జీవితం సానుకూలంగా గడిచిపోతుంది. వృత్తి, వ్యాపారాలు పురోగతి సాధిస్తాయి. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ప్రయత్న లోపం లేకుండా చూసుకోవాలి. పెండింగ్ పనులన్నీ సజావుగా పూర్తవుతాయి. ఇంటా బయటా మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో బాధ్యతల్ని సమర్థవంతంగా పూర్తి చేస్తారు. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు అందుతాయి. ఇతరుల వాద వివాదాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో అధికారులతో సామరస్యం ఏర్పడుతుంది. అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభి స్తుంది. ఆర్థిక ప్రయత్నాల్లో ఆశించిన స్థాయిలో సఫలం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ధైర్యంగా ముందుకు సాగుతారు. వృత్తి, వ్యాపారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. నిరుద్యోగులు తమకందిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఆరోగ్యానికి లోటుండదు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాలు సామరస్యంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలను గడిస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉన్నప్పటికీ ఖర్చుల భారం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహా రాల్లో ఆచితూచి అడుగువేయడం మంచిది. ప్రస్తుతానికి ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం మీద శ్రద్ధ పెట్టాలి. బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. కొద్దిగా అనారోగ్యం ఇబ్బంది పెట్టే సూచనలున్నాయి. ప్రయాణాలలో తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సా హకాలు అందుతాయి. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొం టారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వ్యక్తిగత సమస్యల మీద దృష్టి కేంద్రీక రిస్తారు. ఇంటా బయటా వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. వృథా ఖర్చులను బాగా అదుపు చేస్తారు. కుటుంబ సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ పొందడానికి అవకాశం ఉంది. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారమవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది. ముఖ్యమైన విష యాల్లో బంధుమిత్రుల సహకారం ఉంటుంది. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో అధికారులతో సామరస్యంగా ఉండడం మంచిది. వివాదాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. వ్యాపార వ్యవహారాలు, లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. వృత్తి జీవితంలో సొంత ఆలోచనల వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇంటాబయటా అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువుల విమర్శలను పట్టించుకోకపోవడం శ్రేయస్కరం. ఇంటి పరిస్థితులను చక్కదిద్దుతారు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వ్యక్తిగత జీవితంలో చిన్నా చితకా సమస్యల్ని అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి చాలా వరకు చక్క బడుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. కొందరు బంధువులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. మిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టా ల్సిన అవసరం ఉంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు కనిపిస్తాయి. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడుతుండడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా పురోగమిస్తాయి. ఒకటి రెండు ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ సమస్యల పరిష్కారం మీద శ్రద్ధ పెడతారు. కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆదాయంలో ఆశించిన వృద్ధి ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం సంపాదించుకుంటారు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అదనపు సంపాదనకు అవకాశం ఉంటుంది. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ఆదాయం అన్నివిధాలా మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ప్రయాణాల్లో ఇబ్బంది పడతారు. ఇంటా బయటా పనిభారం ఎక్కువగానే ఉంటుంది. అత్యవసర పనులను విజయవం తంగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో ఫలితాలు ఉత్సాహం కలిగిస్తాయి. పిల్లలు పురోగతి సాధిస్తారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగం సంతృప్తికరంగా సాగుతుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. శ్రమాధిక్యత ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ఆదాయా వకాశాలు పెరుగుతాయి. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. వ్యక్తిగత సమస్యల విషయంలో మిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. పిల్లల చదువుల విషయంలో సంతృప్తి చెందుతారు. ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి జీవి తంలో ఏమాత్రం తీరిక ఉండకపోవచ్చు. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్ని రంగాల వారికి సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఇంటా బయటా మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు.