Reading Time: 2 minutes
How To Update Aadhaar Mobile Number Online Uidai App Steps

UIDAI App: ఈ ఆధునిక యుగంలో బ్యాంకు లావాదేవీల నుంచి ప్రభుత్వ పథకాల వరకు.. ప్రతి చిన్న పనికీ ఆధార్ ఓటీపీ తప్పనిసరిగా మారింది. అయితే చాలామంది తమ ఆధార్‌కు లింక్ అయిన పాత నెంబర్ పనిచేయకపోవడం వల్లనో లేదంటే ఆ నెంబర్ పని చేయకపోవడం లేదా కొత్త నెంబర్ మార్చుకోవడానికి గంటల తరబడి ఆధార్ సేవా కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తుంటారు. మీకు గుడ్ న్యూస్ అండి.. ఇకపై అలాంటి ఇబ్బందులకు శాశ్వతంగా తెరపడింది. ఎక్కడికీ వెళ్లకుండా, ఇంట్లోనే కూర్చుని కేవలం మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా నిమిషాల వ్యవధిలోనే మొబైల్ నెంబర్‌ను అప్‌డేట్ చేసుకునే అద్భుతమైన సదుపాయాన్ని UIDAI (భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ) అందుబాటులోకి తెచ్చింది.

చేతిలోనే ఆధార్ కేంద్రం..

పౌరులకు ఆధార్ సేవలను మరింత చేరువ చేసేందుకు UIDAI కొత్త అధికారిక యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. గతంలో బయోమెట్రిక్ లేదా వివరాల మార్చుకోవడం కోసం మీ సేవా కేంద్రాలను మాత్రమే వెళ్లాల్సి రాగా, ఈ సరికొత్త అప్లికేషన్ ద్వారా ఫేస్ అథెంటికేషన్ ఫీచర్‌ను ప్రవేశపెట్టి సంచలన మార్పునకు నాంది పలికింది. మీ ముఖ గుర్తింపు ద్వారానే ఇంట్లో నుంచే ఆధార్‌లో సరికొత్త ఫోన్ నెంబర్‌ను క్షణాల్లో మార్చుకోవచ్చు.

యాప్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇలా:

* ముందుగా గూగుల్ ప్లే స్టోర్ (లేదా యాప్ స్టోర్) నుంచి UIDAI అధికారిక ఆధార్ యాప్‌ను మీ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి.

* యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు అనుకూలమైన భాషను ఎంచుకోవాలి.

* మీ ఆధార్ వివరాలు నమోదు చేసి, నిబంధనలు, గోప్యతా విధానానికి ఓకే చెప్పాలి తెలపాలి.

* మీ మొబైల్‌లోని సిమ్ కార్డును ఎంపిక చేసి, ఫేస్ అథెంటికేషన్ (ముఖ గుర్తింపు) ప్రక్రియను పూర్తి కంప్లీట్ చేయాలి.

* భద్రత కోసం 6 అంకెల సెక్యూరిటీ పిన్ (PIN) సెట్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.

సింపుల్‌గా మొబైల్ నెంబర్ మార్చుకునే విధానం ఇదే:

* రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక, యాప్‌లోని సర్వీసెస్ విభాగంలో ‘మొబైల్ నెంబర్ అప్‌డేట్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

* ఆధార్‌కు అనుసంధానించాలనుకుంటున్న కొత్త మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయగానే వచ్చే వన్ టైమ్ పాస్‌వర్డ్ (OTP) తో వెరిఫై చేయాలి.

* స్క్రీన్‌పై సూచించిన విధంగా ఫేస్ అథెంటికేషన్ కంప్లీట్ చేయాలి.

* ఈ సేవకు నిర్ణయించిన నామమాత్రపు అధికారిక రుసుమును ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి.

* ఫీ చెల్లించిన కొద్ది రోజుల్లోనే ఆధార్ డేటాబేస్‌లో మీ కొత్త మొబైల్ నెంబర్ సక్సె్స్‌ఫుల్‌గా అప్‌డేట్ అవుతుంది.

దీని కోసం వెళ్తే సరి..

మీ పాత మొబైల్ నెంబర్ ఇంకా అందుబాటులో ఉండి, దానికి వచ్చే సమాచారంతో అప్‌డేట్ చేసుకునే వెసులుబాటు ఉన్నంతవరకే ఈ యాప్ ప్రక్రియ నడుస్తుంది. ఒకవేళ పాత మొబైల్ నెంబర్ శాశ్వతంగా పనిచేయకుండా పోయినా, లేదా జీవితంలో మొదటిసారిగా మీ ఆధార్‌కు ఫోన్ నెంబర్‌ను లింక్ చేయాలనుకున్నా మాత్రం సమీపంలోని అధికారిక ఆధార్ సేవా కేంద్రాన్ని స్వయంగా వెళ్లి బయోమెట్రిక్ ధ్రువీకరణ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, పన్ను రిటర్న్‌లు, బ్యాంకింగ్ సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండాలంటే తక్షణమే ఆధార్‌లో యాక్టివ్ మొబైల్ నెంబర్ ఉండేలా చూసుకోవడం ఎంతో అవసరం.