Reading Time: < 1 minute

మాదాపూర్లో దారుణం.. కారు అద్దానికి తాకాడని… వెంబడించి మరీ ఢీకొట్టాడు

Caption of Image.

అసహనం రోజు రోజుకూ ఎంత పెరుగుతుందో ఉదాహరణ ఈ ఘటన. కారు అద్దానికి తాకాడని వెంబడించి ఢీకొట్టిన ఘటన హైదరాబాద్ మాదాపూర్ లో జరిగింది. 2026 సెప్టెంబర్ 12వ తేదీన మాదాపూర్ అయ్యప్ప సొసైటీ సమీపంలో బైకుపై వెళ్తున్న జంటను కారుతో ఢీకొట్టాడు ఒక వ్యక్తి.

అయ్యప్ప సొసైటీ సమీపంలో ఫ్రీ లెఫ్టులో వెళ్తున్న సమయంలో కారు అద్దానికి బైకు తగిలింది. దీంతో ఆగ్రహం చెందిన కారు ఓనర్..  వెంబడించి మరీ బైకును ఢీకొట్టాడు. కారు ఢీకొట్టడంతో బైకు ఒక్కసారిగా కింద పడిపోయింది.  బైకుపై వెళ్తున్న భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి.

ALSO READ : పరిశ్రమలను బెదిరిస్తే చూస్తూ కూర్చోం

స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. బాధితులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు మాదాపూర్ పోలీసులు.

©️ VIL Media Pvt Ltd.