Reading Time: < 1 minute

రెండు రోజులు హైదరాబాద్ దుర్గం చెరువు ఎంట్రీ క్లోజ్..

Caption of Image.

హైదరాబాదీలకు సాయంత్రం ప్రశాంతంగా గడిపే స్పాట్ లలో ఒకటైన దుర్గం చెరువు ఎంట్రీ రెండు రోజులు క్లోజ్ అవుతోంది. 2026 సెప్టెంబర్ 10, 11వ తేదీల్లో చెరువుకు సందర్శకులకు అనుమతి లేదని నిర్వాహకులు తెలిపారు. ఈ రెండు రోజులు విజిటర్స్ దుర్గం చెరువు పర్యటనను వాయిదా వేసుకోవాలని సూచించారు. 

దుర్గం చెరువు దగ్గర జలమండలి కొన్ని కీలక పనులను నిర్వహిస్తోంది. దుర్గం చెరువులో సౌకర్యాల మెరుగుదలకు మెయింటెనెన్స్ పనులు జరుగుతున్నాయి. నిర్వహణ పనులకు ఆటంకం కలగకుండా ఎంట్రీ క్లోజ్ చేసినట్లు జలమండలి అధికారులు పేర్కొన్నారు. 

ఈ రెండు రోజులు దుర్గం చెరువుకు రావొద్దని సూచించారు. సందర్శకులు సహకరించాలని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విజ్ఞప్తి చేసింది. 

©️ VIL Media Pvt Ltd.