
నిర్మల్ జిల్లా బాసరలో క్షుద్ర పూజల కలకలం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. బాసరలోని కొత్వాల్ కాలనీలో ఉదయం నిద్రలేచి చూసేసరికి ఇళ్ల ముందర, ఆటోలు, ద్విచక్ర వాహనాలపై నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, గాజులు పెట్టి బొమ్మలకు సూదులు గుచ్చి భయానక రీతిలో పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. గత నెల అమావాస్య రోజు కూడా ఇలాగే పూజలు చేశారని, సరిగ్గా నెల రోజులు తిరిగేసరికి మళ్లీ అదే తరహాలో పూజలు చేయడంతో కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే అప్రమత్తమైన స్థానికులు బాసర పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ముధోల్ సీఐ రవీందర్ నాయక్, బాసర SHO దీపక్ పరిశీలించి వివరాలు సేకరించారు. రెండు ఇళ్ల ముందు, ఒక ఆటో, ఒక బైక్‌పై ఈ పూజలు చేసినట్లు గుర్తించారు. ఈ సందర్భంగా సీఐ రవీందర్ నాయక్ మాట్లాడుతూ… క్షుద్ర పూజలు, మూఢనమ్మకాలను నమ్మి ప్రజలు భయపడొద్దని, ధైర్యంగా ఉండాలని సూచించారు. కాలనీలలో ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బాసర పోలీసులు సీసీటీవీ పుటేజీల ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. మూఢనమ్మకాలతో భయభ్రాంతులకు గురిచేస్తున్న ఆకతాయిల ఆట కట్టిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లక్షల ఖర్చు లేదు.. రోడ్డుపైనే పెళ్లి.. వీడియో వైరల్!
తిరుమల గదిలో 9 అడుగుల జర్రిపోతు.. భక్తుల్లో భయం!
పిల్లలకే కాదు.. పెద్దలకూ ఈ టీకాలు చాలా అవసరం
పుట్టగానే పాస్‌పోర్ట్.. ప్రపంచ రికార్డు సృష్టించిన 13 రోజుల చిన్నారి
హిట్టు కొడితే.. కోట్ల విలువ చేసే లగ్జరీ కార్ చేతిలో పడ్డట్టే..