
PM Modi – Netanyahu: భారత్ వేదికగా న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్ సమావేశాలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రధాని నరేంద్రమోడీ ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు, ఇజ్రాయిల్ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదు సమాజానికి రోష్ హషానా సందర్భంగా శుభాకాంక్షలు చెప్పారు. సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోడీ ‘‘షానా టోవా’’ అంటూ తన సందేశాన్ని పంపించారు. ఈ నూతన సంవత్సరం అందరికి శాంతి, ఆశ, మంచి ఆరోగ్యం, నిరంతర పురోగతి తీసుకురాలని మోడీ కాంక్షించారు.
రోష్ హషానా యూదులకు నూతన సంవత్సరం. ప్రపంచ వ్యాప్తంగా యూదు ప్రజలు ఈ పండగను జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ, నెతన్యాహూకు విషెస్ చెప్పారు. మరోవైపు, ఇరాన్ అధ్యక్షుడు మహమ్మద్ పెజెష్కియాన్ భారత్‌లో ఉన్న సమయంలోనే మోడీ ఇలా నెతన్యాహూకు శుభాకాంక్షలు చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్, ఇజ్రాయిల్, ఇరాన్‌కు మిత్రదేశంగా ఉంది. రెండు దేశాలతో వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి. మరోవైపు ఇజ్రాయిల్, ఇరాన్ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి యుద్ధంలో ఉన్నాయి.