అనకాపల్లిజిల్లా నక్కపల్లి మండలం దొడ్డిగొల్లు గ్రామంలో వెంకటేష్ అనే కళాకారుడు సూక్ష్మ కళాఖండాలు రూపొందించడం హాబీ. ప్రతిసారి.. సందర్భానికి అనుగుణంగా సమాజానికి ఒక చక్కని మెసేజ్ ఇస్తుంటాడు వెంకటేష్. అనేక దేవతా మూర్తులు, మహానుభావుల విగ్రహాలు చెక్కి చిన్న వస్తువులపై తనదైన శైలిలో చెక్కి జీవం పోస్తున్నాడు.
దీంతో వెంకటే ప్రత్యేకమైన శిల్పిగా, సూక్ష్మ కళాకారుడి గా ఖ్యాతి గడించాడు. ఇప్పటికే వందల సంఖ్యలో సూక్ష్మ కళాఖండాల రూపొందించి అవార్డులు, రివార్డులు కూడా సొంతం చేసుకున్నాడు వెంకటేష్. అయితే తాజాగా వినాయక చవితి సందర్భంగా ఆది దేవుడి పై భక్తితో పెన్సిల్ మొనపై అద్భుతమైన కళాఖండాన్ని చెక్కాడు.
ఆయన చెక్కిన ఈ విగ్రహం ఎత్తు, వెడల్పు గురించి తెలుసుకుంటే ఔరా అనక మానరు. ఎందుకంటే ఆ విగ్రహం వెడల్పు ఆరు మిల్లీమీటర్లు, ఎత్తు 12 మిల్లీమీటర్లు. 4బి చార్ కోల్ పెన్సిల్ తో మొనపై ఈ సూక్ష్మ కళాఖండం చెక్కడానికి రెండు గంటల సమయం పట్టిందని అంటున్నాడు వెంకటేష్.
ఈ వినాయక చవితి సందర్భంగా భక్తులందరికి ఈ సూక్ష్మ విగ్రహం అంకితం చేస్తున్నట్టు తెలిపాడు వెంకటేష్. పెన్సిల్ మొనపై వెంకటేష్ చెక్కిన ఈ వినాయకుడి స్వరూపం ఇప్పుడు ఔరా అనిపిస్తుంది. ఆ విగ్నేశ్వరుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుతున్నాడు.
అయితే ఈ సూక్ష్మ కళాకారుడు వెంకటేష్ యుఎస్‌లో స్థిర పడ్డాడు. ప్రస్తుతం అతను చికాగోని రవాణా శాఖలో రోడ్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. సందర్భం వచ్చినప్పుడల్లా వెంకటేష్ ఇలా సూక్ష్మకలపై తన ఆసక్తిని ప్రదర్శిస్తూ ఉంటాడు. తెలుగు పండుగల సమయంలో తమ భక్తునిచ్చాడుకుంటూ ఉంటాడు.




