Reading Time: < 1 minute

సముద్రం అదృశ్యమైంది.. ఓడలు ఒడ్డున పడ్డాయి.. అర్జెంటీనాలో ఏం జరిగింది?.. నెట్టింట వైరల్ వీడియోలు

Caption of Image.

అర్జెంటీనా నుండి సముద్రం అదృశ్యమైంది అని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి.  ఈ వీడియోల్లో సముద్రం కిలోమీటర్లమేరకు కనిపించకుండా పోయింది. ఓడలు, పడవలు, సముద్రం అడుగున ఉన్న పెద్ద పెద్దరాళ్లు, గుట్టలు  వీడియోల్లో కనిపిస్తున్నాయి. ఆగస్టు చివరి వారంలో ఇ లాసముద్రం కనిపించకుండా వెనక్కి వెళ్లిపోయింది. ఆశ్చర్యంగా, నాటకీయంగా సముద్రం వెనక్కి పోవడంపై  సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది.. అంతటితో ఆగలేదు.. సముద్రం శాశ్వతంగా  ఎండిపోయింది.. ఇక తిరిగి రాకపోవచ్చు అనే  ఊహాగానాలు బయటికొచ్చాయి. ఇంతకీ సముద్రం ఎందుకు వెనక్కిపోయింది..  రాత్రికిరాత్రే కిలోమీటర్ల మేర కనిపించకుండా పోవడం వెనక రహ్యసం ఏంటీ.. వెనక్కి వెళ్లిన సముద్రం తిరిగి వస్తుందా? ఫుల్ డిటెయిల్స్ తో ..  

ఆగస్టు 2026 చివరి రోజుల్లో అర్జెంటీనా అట్లాంటిక్ తీరప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో సముద్రపు నీరు కిలోమీటర్ల మేర వెనక్కి వెళ్లడం సంచలనంంగా మారింది.బ్యూనస్ ఎయిర్స్ సమీప తీరాల్లో సముద్రగర్భం బయటపడటంతోపాటు పడవలు ఒడ్డున కనిపించాయి. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వీడియోలలో..విశాలమైన సముద్రగర్భం బయటికొచ్చింది. పడవలు ఒడ్డున పడ్డాయి.సాధారణంగా సముద్రపు నీటితో నిండి ఉండే ప్రాంతాలలో ప్రజలు నడవడం కనిపించింది. ఈ అసాధారణ ఫొటోలు పెద్ద ఎత్తున ఊహాగానాలకు దారితీశాయి.

అయితే ఇది సముద్రం శాశ్వతంగా అదృశ్యమవుతున్న సంకేతం కాదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. తీవ్రమైన ఆటుపోట్లు, బలమైన తీరగాలుల పరస్పర ప్రభావంతో ఈ పరిస్థితి ఏర్పడిందని వివరించారు. భూభాగం నుంచి అట్లాంటిక్ వైపు వీచే బలమైన గాలులు ఉపరితల నీటిని తీరం నుంచి దూరంగా తీసుకుపోతాయి. ఇవి సహజ ఆటుపోట్లతో కలిసినప్పుడు తీరప్రాంతంలో నీటిమట్టం ఒక్కసారిగా తగ్గినట్లు కనిపిస్తుంది.

వాతావరణ పరిస్థితులు, గాలి పీడనం, తీరరేఖ ఆకారం, ఆటుపోట్ల చక్రాల్లో మార్పులతో ఇలాంటి హెచ్చుతగ్గులు ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో చోటుచేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. పరిస్థితులు మారిన తర్వాత సముద్రపు నీరు తిరిగి తీరానికి చేరుకుంది. కాబట్టి వైరల్ వీడియోలను చూసి ప్రపంచ పర్యావరణ విపత్తుగా భావించకుండా, శాస్త్రీయ కోణంలో అర్థం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.