Reading Time: < 1 minute
1980s Trend Fake Apps Cyber Scam Apk Files

1980s Trend : ప్రస్తుతం సోషల్ మీడియాలో 1980s ట్రెండ్ తెగ వైరల్ అవుతోంది. ఈ ట్రెండ్‌ను సైబర్ కేటుగాళ్లు కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. 1980s పేరుతో నకిలీ యాప్స్‌ను క్రియేట్ చేసి.. వాటి ద్వారా APK ఫైల్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇలాంటి ఫేక్ యాప్స్‌కు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ట్రెండ్‌ను ఫాలో అవుతున్న నెటిజన్లు వాటిని నిజమైన యాప్స్‌గా భావించి డౌన్‌లోడ్ చేసుకునే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా చాట్‌జీపీటీలో ఫోటో ఎడిటింగ్‌కు సంబంధించిన కొన్ని లిమిట్స్ ఉండటంతో.. కొందరు నెటిజన్లు ప్రత్యామ్నాయ మార్గాల కోసం చూస్తున్నారు. ఈ అవకాశాన్ని సైబర్ నేరగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. 1980s ట్రెండ్ పేరుతో ఫేక్ యాప్స్‌ను ప్రచారం చేస్తూ.. వాటి ద్వారా ఫోటోలను ఎడిట్ చేసుకోవచ్చంటూ నమ్మిస్తున్నారు. అయితే ఇలాంటి యాప్స్‌ను డౌన్‌లోడ్ చేస్తే ఫోన్‌లోని వ్యక్తిగత సమాచారం, ఫోటోలు, ఇతర సున్నితమైన డేటా ప్రమాదంలో పడే అవకాశం ఉంది.

సోషల్ మీడియాలో కనిపించే ప్రతి APK ఫైల్‌ను నమ్మి డౌన్‌లోడ్ చేయొద్దని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా తెలియని లింకులపై క్లిక్ చేయడం, గుర్తు తెలియని యాప్స్‌కు ఫోన్‌లో అనుమతులు ఇవ్వడం వంటి వాటికి దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ట్రెండ్ పేరుతో వచ్చే ఫేక్ యాప్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, యాప్‌ను ఇన్‌స్టాల్ చేసే ముందు దాని సోర్స్‌ను తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.