Reading Time: 2 minutes
Ravi Teja Irumudi Ott Movie Streaming On Netflix From September 18

Irumudi OTT:  మాస్ మహారాజా రవితేజకు చాలా కాలం తర్వాత మంచి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన సినిమా ‘ఇరుముడి’. ఆగస్టు 21న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా దూసుకెళ్తోంది. ఇందులో తండ్రీకూతుళ్ల అనుబంధం, ఎమోషనల్ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను సైతం అలరించడానికి వచ్చేస్తోంది. మరి ఈ మూవీని ఎప్పుడు? ఎక్కడ ? చూడచ్చో తెలుసుకుందాం పదండి.

మాస్ మహారాజా రవితేజ నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘ఇరుముడి’ (Irumudi) 2026 సెప్టెంబర్ 18 నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ Netflix లో డిజిటల్ స్ట్రీమింగ్‌కు రాబోతోంది. మేకర్స్ ఈ విషయాన్ని ఈ రోజు ఆఫీషియల్ గా అనౌన్స్ కూడా చేశారు. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఆగస్టు 21న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్లకు పైగా వసూళ్లతో సంచలన విజయం సాధించింది. థియేటర్లలో ఇంకా మంచి రన్ కొనసాగుతున్నప్పటికీ, ముందే కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం నాలుగు వారాల గడువు పూర్తికాగానే దీనిని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి తీసుకువస్తున్నారు.  నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకోగా, దీనిని తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ, దీ భాషల్లో కూడా ఒకేసారి అందుబాటులోకి తీసుకురానున్నారు. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు లేదా మళ్లీ చూడాలనుకునే హోమ్ ఆడియన్స్ కోసం సెప్టెంబర్ 18 నుండి ఇది స్ట్రీమింగ్ కానుంది.

ఇందులో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించగా, బేబీ నక్షత్ర ఆయన కుమార్తె పాత్రలో కనిపించింది. సాయికుమార్, అజయ్ ఘోష్, స్వాసిక తదితరులు కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం కూడా సినిమాకు హైలెట్ గా నిలిచింది.  ఇప్పటికే థియేటర్లలో సినిమాను చూసిన ప్రేక్షకులు ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఎమోషన్, తండ్రీకూతుళ్ల బంధం, యాక్షన్, ఆధ్యాత్మిక అంశాలను కలిపి రూపొందించిన ఈ కథ డిజిటల్ ఆడియన్స్‌కు కూడా బాగా కనెక్ట్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. ఇక సెప్టెంబర్ 18న ఈ మూవీ టాప్ ట్రెండింగ్ లో నిలవడం ఖాయం అంటున్నారు సినిమా చూసినోళ్ళు.