Reading Time: < 1 minute

ల్యాండ్ స్కాం కేసులో.. టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ పీఏ అరెస్ట్

Caption of Image.

పశ్చిమ బెంగాల్ లో రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఝార్ గ్రామ్ ల్యాండ్ స్కాంలో టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ పీఏ సుమిత్ రాయ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టు ను ఆశ్రయించగా కోర్టు తిరస్కరించడంతో  సుమిత్ రాయ్ ని గురువారం (సెప్టెంబర్ 10)  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

జూన్ 15న పశ్చిమ మేదినిపూర్ జిల్లాలోని ఓ కోర్టు సుమిత్ రాయ్ పై అరెస్ట్ వారెంట్ జారి చేసింది. ఆ తర్వాత సుమిత్ రాయ్ ముందస్తు బెయిల్ కోసం మొదట కోల్ కతా   కోర్టును, ఆతర్వాత  సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  ఆగస్టు 6న రాయ్ కి సుప్రీంకోర్టు స్పెషల్ పిటిషన్ కు అనుమతిచ్చింది. విచారణ జరిగే వరకు రాయ్ ని అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో ఝార్ గ్రామ్  ల్యాండ్  స్కాంపై దర్యాప్తులో భాగంగా సీఐడీ సుమిత్ రాయ్ ని అరెస్ట్ చేసింది. 

ALSO READ : సర్పంచ్లకు పెండింగ్ ఉన్న నిధులు పంచాయతీరాజ్ శాఖ నుంచి లేవు

©️ VIL Media Pvt Ltd.