Reading Time: < 1 minute

అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్తో డీజీపీ కీలక భేటీ..

Caption of Image.

అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో డీజీపీ సీవీ ఆనంద్ 2026 సెప్టెంబర్ 10న భేటీ అయ్యారు. డీజీపీతో పాటు సీపీ సజ్జనార్, డీసీపీ శిల్పవల్లి ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

సెప్టెంబర్ 7న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసనలపై చర్చించినట్లు తెలుస్తోంది. నిరసన వివరాలు స్పీకర్ కు తెలిపింది అధికారుల బృందం.

7వ తేదీన జరిగిన నిరసనలో చోటు చేసుకున్న పరిణామాలపై పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు స్పీకర్. భేటీలో మహిళా పోలీస్ సిబ్బందిని పిలిపించి ఘటనపై ఆరాతీశారు. 

ఈ ఘటనపై అధికార, విపక్ష సభ్యులు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మహిళా ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను అవమాన పరిచారని బీఆర్ఎస్ ఫిర్యాదు చేయగా.. మహిళా పోలీసులపై లైంగిక దాడి చేసినట్లు అధికార పక్షం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఆ రోజు జరిగిన ఘటనపై పూర్తి వివరాలు సేకరించారు స్పీకర్ గడ్డం ప్రసాద్. 
 

©️ VIL Media Pvt Ltd.