Reading Time: < 1 minute

UPSC నోటిఫికేషన్ వచ్చేసింది: 212 ఖాళీ పోస్టులు.. మినిమమ్ డిగ్రీ ఉన్న చాలు..

Caption of Image.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ఎడిటర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, పబ్లిక్ లా ఆఫీసర్/ డిస్ట్రిక్ట్ లిటిగేషన్ ఆఫీసర్ / లా ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు: 212.

విభాగాల వారీగా ఖాళీలు: స్పెషలిస్ట్ గ్రేడ్ III అసిస్టెంట్ ప్రొఫెసర్ (అనాటమీ) 4, స్పెషలిస్ట్ గ్రేడ్ III అసిస్టెంట్ ప్రొఫెసర్ (జనరల్ మెడిసిన్) 60, అసిస్టెంట్ ఎడిటర్ 2, స్పెషలిస్ట్ గ్రేడ్ II జూనియర్ స్కేల్ (అనస్తీషియాలజీ)1, స్పెషలిస్ట్ గ్రేడ్ II జూనియర్ స్కేల్ (పీడియాట్రిక్స్)1, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ 140, పబ్లిక్ లా ఆఫీసర్/ డిస్ట్రిక్ లిటిగేషన్ ఆఫీసర్/లా ఆఫీసర్ 4.

విద్యార్హత
గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఎంబీబీఎస్ తోపాటు ఎంఎస్సీ/ ఎండీ అనాటమీ, జనరల్ మెడిసిన్, అనస్తీషియాలజీ, పీడియాట్రిక్స్ పూర్తిచేసి ఉండాలి. పని అనుభవం తప్పనిసరి.

జర్నలిజం లేదా మాస్ కమ్యూనికేషన్లో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా ఎకనామిక్స్/స్టాటిస్టిక్స్ / ఇంగ్లిష్ కూడిన బ్యాచిలర్స్ డిగ్రీ, జర్నలిజం / మాస్ కమ్యూనికేషన్లో ఏడాది డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. బార్లో రెండేళ్ల ప్రాక్టీస్ అనుభవం ఉండాలి.

వయసు: 40 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఐదేళ్లు వయో పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

అప్లికేషన్: ఆన్ లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 12.

అప్లికేషన్ ఫీజు: మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు ఉండదు. ఇతరులు రూ.25 చెల్లించాలి.

లాస్ట్ డేట్: అక్టోబర్ 2.

సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

మరిన్ని వివరాలకు వెబ్ సైట్  upsc.gov.inను సందర్శించండి.

©️ VIL Media Pvt Ltd.