
మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ ఎట్టకేలకు పోలీసుల ఎదుట హాజరయ్యారు. 2026 సెప్టెంబర్ 10వ తేదీన సాయంత్రం జూబ్లీహిల్స్ పోలీస్టేషన్ కు వచ్చి పోలీసుల ఎదుట హాజరయ్యారు.
కారులో వచ్చిన సుమంత్.. నేరుగా పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లి పోలీసులను కలిశారు. ఇన్ని రోజులు పోలీసుల ముందు హాజరవ్వకుండా ఎందుకు ఉన్నారని మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటవేశారు. మీడియా ప్రశ్నలను తప్పించుకుని పోలీస్ స్టేషన్లోకి పరుగులు తీశారు సుమంత్.
మరోవైపు సుమంత్ కు నాంపల్లి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 9వ తేదీన 25 వేల రూపాయల చొప్పున రెండు వ్యక్తిగ పూచీకత్తులతో బెయిల్ మంజూరు చేసింది.
కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని పోలీసులకు సూచించిన కోర్టు.. దర్యాప్తుకు సుమంత్ పూర్తిగా సహకరించాలని సూచించింది.