
బాలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ వర్మ చుట్టూ ఇప్పుడు ఒక ఊహించని వివాదం ముసురుకుంది. ఆయన నుంచి, ఆయన పీఆర్ (PR) టీమ్ నుంచి తనకు నిరంతరం బెదిరింపు కాల్స్ వస్తున్నాయని సాఫ్ట్ పోర్న్ నటి నేహాల్ వడోలియా చేసిన వ్యాఖ్యలు ఫిల్మ్ ఇండస్ట్రీలో పెను సంచలనంగా మారాయి. తనను భయభ్రాంతులకు గురిచేస్తున్నారంటూ ఆమె చేసిన ఆవేదన ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. గత కొంతకాలంగా తాను ఎదుర్కొంటున్న మానసిక క్షోభను నేహాల్ బహిర్గతం చేశారు. “నేను ఏ పాడ్‌క్యాస్ట్‌కి వెళ్లి మాట్లాడినా నా గొంతు నొక్కేస్తున్నారు, ఈ విషయాన్ని బయటకు రాకుండా తొక్కిపెడుతున్నారు. విజయ్ వర్మ స్వయంగా నాకు కాల్ చేసి బెదిరిస్తున్నాడు, లేదా అతని పీఆర్ టీమ్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నాడు” అంటూ ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఈ వరుస పరిణామాలతో తాను తీవ్ర భయాందోళనలకు గురవుతున్నట్లు ఆమె తెలిపారు. ఈ మేరకు కొన్ని మేసేజులతో కూడిన వీడియో ఒకదాన్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ కూడా చేశారు.
ఇండస్ట్రీలోని ఈ వాతావరణం, ఈ బెదిరింపుల కారణంగా గత నాలుగున్నరేళ్లుగా తాను ఎలాంటి ప్రాజెక్టులు చేయలేదని, కెరీర్‌కు పూర్తిగా దూరంగా ఉన్నానని నేహాల్ వెల్లడించారు. “ఇలాంటి దారుణమైన వాతావరణంలో నేను బతకలేను. నా చుట్టూ మనుషులను కాకుండా కుక్కలు, ఆవులు వంటి జంతువులను ఉంచమని ఆ దేవుడ్ని కోరుకుంటున్నాను.. ఈ మనుషుల కంటే అవే ఎంతో నయం” అంటూ మనుషులపై తనకున్న విరక్తిని అత్యంత ఆవేదనగా బయటపెట్టారు. ఇకపై ఎవరినీ కలిసే ఉద్దేశం తనకు లేదని, ఒంటరిగా ఉండిపోవాలనుకుంటున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ఈ తీవ్రమైన ఆరోపణలు ఇంటర్నెట్‌ను కుదిపేస్తున్నాయి. దీనికి మరింత బలం చేకూర్చేలా ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న ఆమె వీడియో అనే ఫైల్ కూడా ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. నేహాల్ చేసిన ఈ వ్యాఖ్యలపై విజయ్ వర్మ కానీ, ఆయన టీమ్ కానీ ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.