Reading Time: 2 minutes

పెళ్లి వద్దన్నందుకు.. అమెరికాలో భారత సంతతి మహిళను చంపేసిన మరో ఇండియన్..

Caption of Image.

అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించాడు. గతంలో ఒకసారి అరిజోనాలో నిర్బంధానికి గురయ్యాడు. అమెరికా అధికారులు అతడిని భారత్ కు పంపించేలోపే.. మరో భారత సంతతి యువతిని బలితీసుకున్నాడు. కాలిఫోర్నియాలోని సాక్రమెంటోలో జరిగిన ఈ ఘటన అమెరికాలో కలకం రేపింది.  

వివరాల్లోకి వెళ్తే.. షాలినీ ఠాకూర్ అనే 38 ఏళ్ల యువతిని ఘోరంగా కాల్చి చంపేశాడు 22 ఏళ్ల రోహిత్ అనే యువకుడు. దాదాపు  ఏడాది కాలంగా వెంటాడి వేధించి.. పెళ్లికి ఒప్పుకోనందుకు చంపేశాడు. 

ఆర్డెన్-ఆర్కేడ్ ఏరియాలోని పనేరా బ్రెడ్ రెస్టారెంట్ ముందు పట్టపగలే జరిగిన ఈ ఘటన స్థానికులను తీవ్రంగా భయాందోళనలకు గురిచేసింది. షాలినీని దారుణంగా కాల్చేసి పారిపోయిన రోహిత్ ను నిమిషాల వ్యవధిలోనే పోలీసులు ఛేజ్ చేశారు. హైవే 50 దగ్గర పోలీసులు రౌండప్ చేస్తున్న క్రమంలో కాల్చుకుని చనిపోయాడు. 

చచ్చినా వదల్లేదు..

రోహిత్ దాడి చేసిన తీరు చాలా క్రూరంగా ఉందని ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపారు. రోహిత్ అటాక్ చేస్తుండగా తప్పించుకునేందుకు పరుగులు పెట్టిన షాలినీని వెంటాడీ, వేటాడి కాల్చేశాడు. అప్పటికే పలుమార్లు కాల్చిన రోహిత్.. ఆమె కుప్పకూలిపోయాక తలకు పాయింట్ బ్లాంక్ రేంజ్ లో షూట్ చేశాడు. 

నెలల తరబడి వేధింపులు:

రోహిత్ తన కూతురిని ఏడాది కాలంగా వేధిస్తున్నట్లు షాలినీ తల్లి సుదేశ్ కుమారి తెలిపారు. రోహిత్ తన కూతురిని పెళ్లి చేసుకోవాలని వెంటపడ్డాడని.. వయసు తక్కువగా ఉండటంతో తన కూతురు రిజెక్ట్ చేసినట్లు తెలిపింది. అతనికి చాలా భయపడుతూ ఉండేదని చెప్పింది. 

ఈ ఘటనకు ముందు షాలినీతో రోహిత్ దాదాపు గంటసేపు మాట్లాడినట్లు ఆమె చెప్పారు. అదే సమయంలో తను ఫోన్ చేస్తే.. 15 నిమిషాల్లో కాల్ చేస్తానని చెప్పి కాల్ చేయలేదని అన్నారు. 

రెండేళ్ల క్రితం షాలినీ భర్త మృతి:

షాలినీ భర్త రెండేళ్ల క్రితం చనిపోయాడని.. రోహిత్ పరిచయం పెంచుకుని.. కాల్ మీ, నీ గురించి చాలా ఆందోళన చెందుతున్నానని.. మెస్సేజ్ లు పంపేవాడని ఆమె పేర్కొన్నారు.  అప్పటికే అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని.. 2025 నుంచి వేదింపులకు పాల్పడుతూ.. ఈ మధ్య మరీ విపరీతంగా వెంటపడుతున్నట్లు పేర్కొన్నారు. 

షాలినీకి రోహిత్ తో ఆమె పనిచేసే డోర్ డాష్ పికప్స్ దగ్గర పరిచయం అయినట్లు ఆమె తల్లి చెప్పారు. అతడి వేధింపుల తర్వాత ఆమె అవాయిడ్ చేస్తూ వ చ్చినట్లు చెప్పారు. ఇంటి ముందు గంటల తరబడి నిలబడటం, ఫాలో కావడం చేసేవాడని.. ఆపిల్ ఎయిర్ ట్యాగ్ (Apple AirTag) కార్ కు అతికించి ట్రాక్ చేసినట్లు పోలీసులు తెలిపారు. 

ఆ తర్వాత రోహిత్ దారుణంగా వెంబడించడం మొదలుపెట్టాడని.. షాలినీ ఇంటి తాళం నకిలీ చేయించి.. ఆమె ఇంట్లో ఉండగా ప్రవేశించినట్లు చెబుతున్నారు. అదే విధంగా ఆమె ఎవరితో మాట్లాడాలి.. ఎవరితో మాట్లాడొద్దు అనే కండిషన్స్ పెట్టే వరకు వచ్చాడని.. దీంతో కోర్టు ద్వారా మే 19న అతనిపై షాలినీ రీస్ట్రెయినింగ్ ఆర్డర్ ఇప్పించదని.. కానీ ఆర్డర్స్ ఉల్లంఘించి.. చివరికి ఆమెను చంపేసి అతడూ చనిపోయాడని పోలీసులు తెలిపారు. 

©️ VIL Media Pvt Ltd.