Reading Time: < 1 minute

ఆర్మూర్ మున్సిపల్ బిల్డింగ్ నిర్మాణానికి 7.50 కోట్లు మంజూరు

Caption of Image.

ఆర్మూర్, వెలుగు: నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​లో మున్సిపల్ కార్యాలయం భవన నిర్మాణానికి రూ.7.50 కోట్లు మంజూరు చేస్తూ సీడీఎంఏ శ్రీదేవి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

సీఎం రేవంత్ రెడ్డిని తాను కలిసి మున్సిపల్​కు నిధులు ఇవ్వాలని కోరిన రెండు రోజుల్లోనే మున్సిపల్ ​బిల్డింగ్​కు రూ.7.50 కోట్లు మంజూరు చేయడం హర్షనీయమని ఎమ్మెల్యే పైడి రాకేశ్​ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. 
సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.