
ముషీరాబాద్, వెలుగు: వేతనం రూ.18 వేలు ఇవ్వాలని, కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో బుధవారం ఇందిరాపార్క్‌వద్ద నిర్వహించిన చలో హైదరాబాద్ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ర్యాలీగా బయలుదేరుతున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లను పోలీసులు అరెస్ట్‌చేసి, ఠాణాలకు తరలించారు.
సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలు కె.సునీత మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.