Reading Time: < 1 minute
JAM 2027 రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. 23 ఐఐటీల్లో పీజీ ప్రవేశాలు షురూ

హైదరాబాద్‌, సెప్టెంబర్ 13: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) ఖరగ్‌పూర్‌ 2027 విద్యా సంవత్సరానికి నిర్వహించనున్న జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (JAM) 2027 రిజిస్ట్రేషన్ ప్రక్రియను సెప్టెంబర్ 12 నుంచి ప్రారంభించింది. అర్హత ఉన్న అభ్యర్థులు JAM Online Application Processing System (JOAPS) పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు అక్టోబర్ 12, 2026 చివరి తేదీగా నిర్ణయించారు. JAM 2027 స్కోర్ ద్వారా దేశంలోని ఐఐటీలతో పాటు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc)లో వివిధ MSc, ఇంటిగ్రేటెడ్ MSc-PhD తదితర పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం పొందే అవకాశం ఉంటుంది. 2027-28 విద్యా సంవత్సరానికి 23 ఐఐటీల్లో దాదాపు 3,000 పోస్ట్‌గ్రాడ్యుయేట్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. JAM 2027 పరీక్షను వచ్చే ఏడాది ఫిబ్రవరి 14, 2027న రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు. అభ్యర్థులు గరిష్టంగా రెండు టెస్ట్ పేపర్లకు హాజరుకావచ్చు. అయితే ఆ రెండు పేపర్లు వేర్వేరు పరీక్షా సెషన్లలో ఉండాలి.

JAM 2027 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎవరెవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

JAM 2027కు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ప్రస్తుతం బ్యాచిలర్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం

  • ముందుగా అధికారిక JOAPS పోర్టల్‌లోకి వెళ్లాలి.
  • పేరు, చెల్లుబాటు అయ్యే ఈమెయిల్ చిరునామా, మొబైల్ నంబర్, పాస్‌వర్డ్‌తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
  • అనంతరం వ్యక్తిగత, విద్యా, పరీక్షకు సంబంధించిన వివరాలను నమోదు చేయాలి.
  • హాజరు కావాలనుకునే టెస్ట్ పేపర్/పేపర్లను ఎంచుకోవాలి.
  • అవసరమైన ఫోటో, సంతకం, విద్యార్హతల ధ్రువపత్రాలను అప్‌లోడ్ చేయాలి.
  • దరఖాస్తు రుసుమును చెల్లించాలి.
  • అన్ని వివరాలను పరిశీలించిన తర్వాత దరఖాస్తును సమర్పించాలి.
  • చివరగా దరఖాస్తు ఫారమ్, ఫీజు చెల్లింపు వివరాలను డౌన్‌లోడ్ చేసుకుని భద్రపరుచుకోవాలి.
  • దరఖాస్తు ఫీజు మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఒక పేపర్‌కు రూ.1000, రెండు పేపర్లకు రూ.1350, ఇతర అభ్యర్థులకు ఒక
  • పేపర్‌కు రూ.2,000, రెండు పేపర్లకు రూ.2,700 చొప్పున దరఖాస్తు చేసుకోవాలి.
  • అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిది.

JAM 2027 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.