Reading Time: < 1 minute

హైదరాబాద్లో సిటీ బస్సు బీభత్సం.. పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లిన దిల్‌సుఖ్‌నగర్ బస్సు!

Caption of Image.

హైదరాబాద్ లో సిటీ బస్సు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లింది. 2026 సెప్టెంబర్ 10వ తేదీ మధ్యాహ్నం అబ్దుల్లాపూర్‌మెట్ బాటసింగారంలో జరిగింది ఈ ఘటన.

దిల్‌సుఖ్‌నగర్ నుంచి చౌటుప్పల్ వెళ్తున్న ఆర్టీసీ అద్దె బస్సు.. బైక్‌ను తప్పించబోయి పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లింది.  దిల్‌సుఖ్‌నగర్ డిపోకు చెందిన బస్సుగా చెబుతున్నారు. అతివేగం కారణంగా బస్సు అదుపుతప్పినట్లు ఘటన స్థలంలో ఉన్న సాక్ష్యులు చెబుతున్నారు. 

ALSO READ : తెలంగాణ సచివాలయంలో ఏసీబీ సోదాలు..

ఈ ప్రమాదంలో రెండు కార్లు, ఓ ఆటో ధ్వంసం అయ్యింది. డీజిల్ పంపు ఉన్న ప్రాంతంలోకి బస్సు దూసుకెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. డీజిల్ పంపు స్టాండ్ విరిగిపడింది. బస్సు వేగాన్ని చూసి సిబ్బంది పరుగులు పెట్టారు. ఘటనతో బంక్ సిబ్బంది, స్థానికుల్లో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.  
 

©️ VIL Media Pvt Ltd.