
ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్లు భారత్‌లో ఏకంగా 256జీబీ, 512 జీబీ, 1టీబీ, 2టీబీ హై-ఎండ్ స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులోకి రానున్నాయి. డీప్ బ్లాక్, సిల్వర్, గ్లేసియర్ బ్లూతో పాటు ఈసారి పూర్తిగా కొత్తగా ‘బర్గుండీ’ (Burgundy) కలర్‌లో ఈ ఫోన్లు వస్తుండటం టెకీలను తెగ ఆకట్టుకుంటోంది.
ఫోల్డబుల్ ఫోన్ ను ఓపెన్ చేస్తే ప్రపంచంలోనే స్లిమ్ ఐఫోన్‌గా మారిపోతుంది. దీని కోసమే iOS 27ను పూర్తిగా రీడిజైన్ చేశారు. బుక్-స్టైల్ ఫోల్డింగ్ డిజైన్‌తో వస్తున్న ఈ ఫోన్, క్లోజ్ చేసినప్పుడు 5.4 ఇంచెస్, ఓపెన్ చేస్తే ఏకంగా 7.6 ఇంచెస్ సూపర్ రెటినా డిస్‌ప్లేతో అద్దిరిపోయే లుక్‌లో ఉంది. దీన్ని ఓపెన్ చేస్తే రెండు హోమ్ స్క్రీన్ పేజీలు, మెయిల్, మెసేజెస్ ఒకేసారి పక్కపక్కనే వాడుకోవచ్చు. అదే క్లోజ్ చేస్తే 5.4 ఇంచెస్ సైజ్‌తో బెడ్‌సైడ్ క్లాక్ లాగా విడ్జెట్స్, వెదర్, క్యాలెండర్, మ్యూజిక్ వినేలా మారుతుంది. ఐఫోన్ ప్రియులకు ఇది కంప్లీట్ ఐ ట్రీట్ అనే చెప్పాలి.
Apple Foldable Phone Iphone Duo
ఐఫోన్ మోడల్స్ అన్నీ కూడా లేటెస్ట్ ‘A20 ప్రో’ చిప్‌సెట్, పవర్‌ఫుల్ ఏఐ ఫీచర్స్ (Siri AI), 12GB RAM తో మార్కెట్ ని షేక్ చేయడానికి సిద్ధమయ్యాయి. ఫోల్డబుల్ ఐఫోన్ డ్యూయో ధర రూ. 2,99,900 నుంచి మొదలవ్వగా, ఐఫోన్ 18 ప్రో మోడల్స్ ప్రీ-ఆర్డర్స్ సెప్టెంబర్ 12 నుంచి స్టార్ట్ కానున్నాయి. ఫోల్డబుల్ ఫోన్ సేల్స్ మాత్రం అక్టోబర్ నుంచి ప్రారంభం కానున్నాయి.
నెక్స్ట్ లెవెల్ డిస్‌ప్లే
6.9 ఇంచెస్ బిగ్ స్క్రీన్‌తో వచ్చే ‘ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్’ లో ప్రో మోడల్ ఫీచర్స్ ఇంకా మాస్ లెవెల్‌లో లభిస్తాయి. ఒక్క సింగిల్ ఛార్జ్‌తో ఏకంగా 30 గంటల నార్మల్ యూసేజ్, 45 గంటల నాన్‌స్టాప్ వీడియో ప్లేబ్యాక్ ఇస్తుంది. బ్యాటరీ విషయంలో కంప్లీట్ అన్‌స్టాపబుల్ అంతే!
ఎయిర్‌పాడ్స్ 5
ఈసారి కంప్లీట్లీ డిఫరెంట్ ఓపెన్-ఇయర్ డిజైన్‌తో మార్కెట్‌లోకి వస్తోంది. ఇయర్స్ కి ఎలాంటి ప్రెజర్ లేకుండా సూపర్ కంఫర్టబుల్ ఫిట్ ఇస్తుంది. పాత ఎయిర్‌పాడ్స్‌తో పోలిస్తే బయటి శబ్దాలను తగ్గించే (Noise Reduction) కెపాసిటీ మరో 50% ఎక్స్‌ట్రా పెరిగింది. పబ్లిక్ ప్లేస్‌లో ఉన్నా మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు. లైవ్ ట్రాన్స్‌లేషన్, సిరి లాంటి అడ్వాన్స్డ్ ఇంటెలిజెంట్ ఫీచర్స్‌ని ఫుల్లీ హ్యాండ్స్-ఫ్రీ మోడ్‌లో వాడొచ్చు. వీటితో పాటు కెమెరా రిమోట్, వాల్యూమ్ స్వైప్ లాంటి లేటెస్ట్ జెన్-జీ ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి.
ఈసారి యాపిల్ వాచ్ సిరీస్ లో ఏఐ బేస్డ్ ఆడియో ఫీచర్స్ ఇచ్చారు. ముఖ్యంగా ‘లైవ్ రివైండ్’ ఆప్షన్‌తో కరెక్ట్ గా 15 సెకన్ల ముందు జరిగిన సంభాషణను కూడా వెనక్కి తెచ్చి వినొచ్చు! అప్‌గ్రేడెడ్ ఈసీజీ, ఆప్టికల్ సెన్సింగ్ సిస్టమ్‌తో ఇవి వస్తున్నాయి. ప్రెజంట్ హార్ట్‌బీట్ ప్రతి 5 సెకండ్స్‌కి ఒకసారి రికార్డ్ అవుతుంది. పాత మోడల్స్‌తో పోలిస్తే ఇది ఏకంగా 60 టైమ్స్ ఫాస్ట్. మీ స్లీప్, బ్లడ్ డేటాని రియల్ ఏజ్ (వాస్తవ వయసు) తో కంపేర్ చేసి హెల్త్ కండిషన్‌ను పర్ఫెక్ట్‌గా ట్రాక్ చేసి చెప్పే సూపర్ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి