Reading Time: < 1 minute
క్రికెట్‌ ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం

క్రికెట్‌ ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం తీసుకుంది. క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు బిగ్ బాష్ లీగ్ ను ప్రైవేటీకరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఐపీఎల్ ఫ్రాంచైజీలైన రిలయన్స్, రెడ్ చిల్లీస్, ఆర్‌పిఎస్‌జి, జీఎంఆర్ వంటి దిగ్గజ సంస్థలు ఆస్ట్రేలియా లీగ్‌పై దృష్టి పెట్టాయి. ఈ లీగ్‌లో జట్లను దక్కించుకోవడం ద్వారా గ్లెన్ మాక్స్‌వెల్, కేమరాన్ గ్రీన్ వంటి స్టార్ ఆటగాళ్లతో ఏడాది పొడవునా ఒప్పందాలు చేసుకునే అవకాశం ఐపీఎల్ యజమానులకు లభిస్తుంది. జట్లను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మినప్పటికీ, లీగ్ నియంత్రణ మాత్రం పూర్తిగా క్రికెట్ ఆస్ట్రేలియా చేతిలోనే ఉంటుంది. షెడ్యూల్, ప్రసార హక్కులు, జీతాల పరిమితిపై బోర్డుదే తుది నిర్ణయం. భారతీయ సంస్థలకు రెండు లేదా మూడు జట్లకు మించి విక్రయించకూడదని భావిస్తున్నారు. మెల్‌బోర్న్ రెనెగేడ్స్ జట్టును పూర్తిగా విక్రయిస్తుండగా, మిగిలిన జట్లలో 49 శాతం వరకు మాత్రమే ప్రైవేట్ భాగస్వామ్యానికి అవకాశం ఇస్తున్నారు. అయితే, పురుషుల భారత స్టార్ ఆటగాళ్లు బీబీఎల్‌లో ఆడే అవకాశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. విదేశీ లీగ్‌లలో ఆడేందుకు కాంట్రాక్టులో ఉన్న పురుష ఆటగాళ్లకు బీసీసీఐ ఇంకా అనుమతి ఇవ్వలేదు. మహిళా క్రికెటర్లు ఇప్పటికే ఆడుతుండగా, భవిష్యత్తులో రిటైర్ అయిన లేదా కాంట్రాక్ట్ లేని పురుష ఆటగాళ్లకు బీసీసీఐ మినహాయింపు ఇస్తే, ఈ లీగ్ విలువ మరింత పెరిగే అవకాశం ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గణపతి విగ్రహం కొంటున్నారా.. ఎలాంటి విగ్రహం కొనాలో తెలుసా?

రీల్స్ చూస్తుండగా సిగ్నల్ కట్.. మనస్తాపంతో మహిళ ఆత్మహత్య!

నందనను బిగ్ బాస్ లోకి తీసుకుంటే మర్యాదగా ఉండదు..

ఏఐ రెట్రో లుక్స్‌తో అదరగొడుతున్న సెలబ్రిటీలు! వైరల్ అవుతున్న కియారా, సిద్ధార్థ్ కొత్త ఫోటో!

Hyderabad: ఆర్టీసీ నైట్​ సర్వీసులు షురూ – హైదరాబాద్‌లో ఇక 24/7 బస్సులు