
శ్రీశైలం, వెలుగు: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులే టర్వద్ద తెగిపోయిన 9వ గేటును రోప్స్థానం లో కొత్త రోప్ను ఏర్పాటు చేస్తామని ఆ ప్రాజెక్టు ఏఈ సుబ్రమణ్యం రెడ్డి తెలిపారు. ఏపీలోని నంద్యాల జిల్లాలో ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద గురువారం సాయంత్రం 9వ గేటు తెరుస్తుండగా, రోప్తెగిపోయి గేటుకు కిందకు పడిపోయింది.
విషయం తెలుసుకున్న ఏఈ శుక్రవారం ఉదయం ప్రాజెక్టును సందర్శించి డ్యామేజ్ జరిగిన గేటును పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ను నిర్మించి 16 ఏండ్లు కావస్తోందన్నారు. దీంతో గేట్ల పరిస్థిని ఎలా ఉంది? వాటికి సం బంధించిన రోప్పటిష్టంగా ఉందా? లేదా? అని ప్రతి ఏడాది పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.