
- మూడ్రోజుల పరిణామాలపై సర్వే చేయించాం
- జనం బీఆర్ఎస్ తీరునే తప్పు పట్టిన్రు
- సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి
సోమవారం నుంచి బుధవారం వరకు 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ గొడవలు, అనంతర పరిణామాలు, సభ జరిగిన తీరుపై ఫ్లాష్ సర్వే చేయించినట్టు సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. బీఆర్‌ఎస్ నేతల తీరునే ప్రజలు తప్పుబట్టినట్టు సర్వేలో వెల్లడైంద న్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత లేనట్టు తేలిందని చెప్పారు. అందులో కాంగ్రెస్ కే జనం జై కొట్టా రని చెప్పినట్టు సమాచారం.