Reading Time: < 1 minute

రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు పడతయో డేట్ వచ్చేసింది !

Caption of Image.

ప్రధాన మంత్రి కిసాన్ 23వ విడత డబ్బులను జూన్ 20న విడుదల చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రూ.2 వేల రూపాయలను ఈ పథకంలో లబ్ధిదారులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపింది.

అయితే.. లబ్దిదారులు ఈ-కేవైసీని పూర్తి చేయాలని.. అప్పుడే ఈ డబ్బులు అకౌంట్లో పడతాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పీఎం కిసాన్ పథకం కింద.. అర్హులైన రైతులకు ఏడాదికి రూ.6 వేల చొప్పున.. మూడు వాయిదాల్లో.. వాయిదాకు రెండు వేల రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తున్న సంగతి తెలిసిందే.

డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) విధానంలో నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు ఈ సొమ్మును బదిలీ చేస్తున్నారు. విత్తనాలు, ఎరువుల కొనుగోలు, రోజువారీ వ్యవసాయ ఖర్చులు, వ్యవసాయ పరికరాలు, ముడి సరుకులు.. ఇలా రైతులకు ఏదో ఒక విధంగా ఈ పీఎం కిసాన్ డబ్బులు ఉపయోగపడుతున్నాయి.

►ALSO READ | త్వరలో భారత్-అమెరికా మధ్య ట్రేడ్ డీల్.. ఇండియాపై దాడి జరిగితే అండగా మేముంటాం

2026 మార్చి 13న గౌహతి వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ 22వ విడుత డబ్బులను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పీఎం కిసాన్ డబ్బులు పొందాలంటే.. రైతులు మూడు రకాలుగా ఈ-కేవైసీ చేసుకోవచ్చు. మొబైల్ ఫోన్ లో ఓటీపీ ఆధారిత ఈ-కేవైసీ, కామన్ సర్వీస్ సెంటర్లలో బయోమెట్రిక్ ఈ-కేవైసీ, మొబైల్ యాప్లో ఫేస్ రికగ్నిషన్ విధానంలో ఈ-కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. 2026 జూన్ 30 లోపు ఈ-కేవైసీ పూర్తి చేసుకోసువాలని కేంద్రం గడువు విధించింది. గడువులోగా ఈ-కేవైసీ పూర్తి చేయని రైతులకు రాబోయే విడత పీఎం కిసాన్ డబ్బులు పడకపోవచ్చు.

©️ VIL Media Pvt Ltd.