Reading Time: 2 minutes
NSP Scholarship 2026: విద్యార్థులకు శుభవార్త.. మీ తల్లిదండ్రులు ఈ రంగాల్లో పనిచేస్తున్నారా? అయితే స్కాలర్‌షిప్ పొందే అవకాశం మీకే!

హైదరాబాద్: భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలోని ‘లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ (LWO)’, ‘వెల్ఫేర్ కమిషనర్ కార్యాలయం’ 2026–27 విద్యా సంవత్సరానికి విద్యార్థుల కోసం వివిధ విద్యా ఆర్థిక సహాయ (స్కాలర్‌షిప్) పథకాల కింద ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న బీడీ కార్మికులు, లైమ్‌స్టోన్ & డోలమైట్ గని కార్మికులు, ఇనుప ఖనిజం, మాంగనీస్ ఖనిజం, క్రోమ్ ఖనిజం గని కార్మికులు, మైకా గని కార్మికులు, సినీ కార్మికుల పిల్లలు ఈ స్కాలర్‌షిప్‌లకు అర్హులు.

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

  • ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్: 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు.
  • పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్: 11వ తరగతి నుంచి ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సులు చదువుతున్న విద్యార్థులు.
  • అర్హులైన విద్యార్థులు.. నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ (NSP) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు:

  • ప్రీ-మెట్రిక్ (1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు)
  • దరఖాస్తు చివరి తేదీ: 31 ఆగస్టు 2026

 

  • పోస్ట్-మెట్రిక్ (11వ తరగతి నుంచి ప్రొఫెషనల్ డిగ్రీ వరకు)
    దరఖాస్తు చివరి తేదీ: 31 అక్టోబర్ 2026

దరఖాస్తు ఎలా చేయాలి?

విద్యార్థులు నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ (NSP)లో నమోదు చేసుకుని అవసరమైన వివరాలు, పత్రాలను సమర్పించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.

నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సాంకేతిక సహాయం కోసం

దరఖాస్తు సమర్పణ లేదా ధృవీకరణకు సంబంధించి ఏవైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే NSP హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించవచ్చు.

హెల్ప్‌డెస్క్ నంబర్: 0120-6619540
ఇ-మెయిల్: [helpdesk@nsp.gov.in](mailto:helpdesk@nsp.gov.in)

మరిన్ని వివరాల కోసం

వెల్ఫేర్ కమిషనర్ కార్యాలయం, లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్,
రూమ్ నెం. 54, కేంద్రియ సదన్, సుల్తాన్ బజార్, కోటి, హైదరాబాద్ – 500001

  • ఫోన్: 040-29561297
  • ఇ-మెయిల్: [wclwohyd@nic.in](mailto:wclwohyd@nic.in)

అదనంగా, సమీపంలోని లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ డిస్పెన్సరీలను కూడా సంప్రదించవచ్చు.

తరగతి / కోర్సు సంవత్సరానికి అందే స్కాలర్​షిప్

  • 1 నుంచి 4 తరగతులు – రూ.1,000
  • 5 నుంచి 8 తరగతులు – రూ.1,500
  • తొమ్మిదో తరగతి – రూ.2,000
  • పదో తరగతి – రూ.2,000
  • 11, 12 తరగతులు – రూ.3,000
  • ITI – రూ.6,000
  • పాలిటెక్నిక్ కోర్సులు – రూ.6,000
  • డిగ్రీ కోర్సులు – రూ.6,000
  • ప్రొఫెషనల్ కోర్సులు – రూ.25,000.

అర్హులైన విద్యార్థులు తప్పక వినియోగించుకోవాలి

ఈ స్కాలర్‌షిప్‌లు కార్మిక కుటుంబాల విద్యార్థులకు ఉన్నత విద్యను కొనసాగించేందుకు ఆర్థికంగా ఎంతో తోడ్పడతాయి. అర్హులైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గడువు తేదీలకు ముందుగానే దరఖాస్తులు సమర్పించాలని వెల్ఫేర్ కమిషనర్ సూచించారు.