Reading Time: < 1 minute

IPLకి గుడ్బై.. 3 రోజులకే మరో లీగ్లోకి విజయ్ శంకర్ ఎంట్రీ..

Caption of Image.

Vijay Shankar: ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కేవలం మూడు రోజులకే భారత మాజీ ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ ఒక క్రేజీ డీల్ కుదుర్చుకున్నాడు. శ్రీలంక వేదికగా జరగబోయే లంక ప్రీమియర్ లీగ్ (LPL 2026) ఆరో ఎడిషన్ కోసం అతను ‘మార్క్యూ ప్లేయర్’ (Marquee Signing) గా ఎంపికయ్యాడు. తమిళనాడుకు చెందిన విజయ్ శంకర్ ఈ టోర్నీలో క్యాండీ రాయల్స్ (Kandy Royals) జట్టుకు ప్రాతినిధ్యం వహించబోతున్నాడు. జూన్ 1వ తేదీన జరగబోయే ప్లేయర్ డ్రాఫ్ట్‌కు ముందే లీగ్‌లోని ఫ్రాంచైజీలు తమ కోర్ టీమ్‌లను, టాప్ ఓవర్సీస్ ప్లేయర్లను రిటైన్ చేసుకున్నాయి.

క్యాండీ రాయల్స్ జట్టులో విజయ్ శంకర్ ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీతో జతకట్టనున్నాడు. 2019 వన్డే వరల్డ్‌కప్‌లో భారత్ తరఫున ఆడి, వరల్డ్‌కప్ హిస్టరీలోనే తాను వేసిన మొదటి బంతికే వికెట్ తీసిన అరుదైన రికార్డు విజయ్ శంకర్‌కు ఉంది. ఇప్పుడు క్యాండీ రాయల్స్ జట్టులోకి అతను రావడంతో టీమ్‌కు మంచి అనుభవంతో పాటు సరైన బ్యాలెన్స్ దొరుకుతుందని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీ శ్రీలంక స్టార్ ప్లేయర్లు వనిందు హసరంగ, ఏంజెలో మాథ్యూస్‌లతో పాటు మొయిన్ అలీని కూడా రిటైన్ చేసుకుని చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది.

ఇంకోవైపు డిఫెండింగ్ ఛాంపియన్స్ జాఫ్నా కింగ్స్ కూడా లీగ్‌లో తమ హవాను కొనసాగించేందుకు గట్టి స్కెచ్ వేసింది. బంగ్లాదేశ్ సీనియర్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌తో పాటు శ్రీలంక ఇంటర్నేషనల్ ప్లేయర్లు దునిత్ వెల్లలాగే, భానుక రాజపక్షలను ఆ జట్టు రిటైన్ చేసుకుంది.

కాగా ఈ సారి లంక ప్రీమియర్ లీగ్ మస్తు క్రాక్ ఉండబోతుందని టోర్నమెంట్ డైరెక్టర్ సమంత దొడన్‌వెల చెప్తున్నారు. ఇంటర్నేషనల్ స్టార్స్ రాకతో లీగ్ గ్లోబల్ వైడ్ గా ఆదరణ పొందుతుందని చెప్పుకొచ్చారు. జూన్ 1న జరిగే ప్లేయర్ డ్రాఫ్ట్‌కు ముందే ఈ అప్‌డేట్స్ లీగ్‌పై భారీ హైప్‌ను క్రియేట్ చేశాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ క్రేజీ టోర్నీ జూలై 17 నుంచి ఆగస్టు 8 వరకు శ్రీలంక వేదికగా సాగనుంది.

©️ VIL Media Pvt Ltd.