
చాలా రోజుల తర్వాత అంటే దాదాపు పదేళ్ల తర్వాత అమెరికా అధ్యక్షుడు చైనాకు వెళ్లారు. మే13, 2026 బుధవారం సాయంత్రం ట్రంప్ బీజీంగ్ చేరుకున్నారు. దశాబ్ద కాలంలో ట్రంప్ చైనా వెళ్లడం ఇదే మొదటిసారి. వాణిజ్యం, తైవాన్, టెక్నాలజీ , సైనిక పరంగా రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నడుమ చైనా, అమెరికా మధ్య సత్సంబంధాలు చెడిపోతున్న క్రమంలో ఈ పర్యటనకు అత్యంత ప్రాధాన్యత ఉంది. బీజింగ్ లో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు ట్రంప్.. అధికారిక విందు, టీ విందు వంటి మర్యాదపూర్వక కార్యక్రమాలు అన్నీ ఏర్పాటు చేసింది చైనా. ప్రపంచంలోనే అదిపెద్ద ఆర్థిక వ్యవస్థల గల దేశాల మధ్య జరగబోయే చర్చలపైనే అందరి దృష్టి ఉంది. ఇలాంటి సమయంలో ట్రంప్ పర్యటనపై అమెరికాలో చైనా ఎంబసీ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నాలుగు రెడ్ లైన్ల నోట్ తో చైనా .. ట్రంప్ కు స్ట్రాంగ్ వార్నింగ్ మేసేజ్ పంపింది. అదేంటో చూద్దాం..
#WATCH | Beijing: US President Donald Trump lands in China for a high-stakes summit with Chinese President Xi Jinping.
(Video Source: US Network Pool via Reuters) pic.twitter.com/L5o9iVvAQh
— ANI (@ANI) May 13, 2026
ట్రంప్ రాకకు కొద్దిసేపటి ముందు, అమెరికాలోని చైనా రాయబార కార్యాలయం సోషల్ మీడియాలో ఒక ప్రకటనను విడుదల చేసింది. చైనా కొన్ని విషయాలపై రాజీపడదని, అమెరికా హద్దులు దాటకూడని నాలుగు ప్రధాన రంగాలపై నాలుగు రెడ్ లైన్ల పేరుతో సోషల్ మీడియాలో రాసింది.
రెండు దేశాలు శాంతియుతంగా , వ్యూహాత్మకంగా, నిర్మానాత్మకంగా , స్థిరమైన సత్సంబంధాలు నెలకొల్పే దిశగా కృషి చేయాలి. తైవాన్ విషయం, ప్రజాస్వామ్యం ,మానవ హక్కుల సమస్యలు,చైనా రాజకీయ వ్యవస్థ
చైనా అభివృద్ధి హక్కులు వంటి నాలుగు కీలకమైన విషయాల్లో వేలు పెట్టొద్దని క్లియర్ గా చెప్పింది. ఒకరకంగా చెప్పాలంటే ఇది ట్రంప్ కు చైనా ఇచ్చిన వార్నింగ్.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ప్రపంచ దేశాలపై విధించిన పన్నుల విషయంలో కోర్టులో ఎదురు దెబ్బలతో స్వదేశంలో ఒత్తిడి ఎదుర్కొంటున్న సమయంలో ట్రంప్ చైనాలో పర్యటిస్తున్నారు. వాణిజ్యానికి అతీతంగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజీ,సరఫరా చైన్ లో పెరుగుతున్న పోటీ గురించి కూడా ఇద్దరు నేతలు చర్చించే అవకాశం ఉంది. ఎలక్ట్రానిక్స్ ,రక్షణ తయారీకి అవసరమైన అరుదైన ఖనిజాల ఎగుమతులపై చైనా నియంత్రణ వాషింగ్టన్‌కు సంకటంగా మారిన విషయం తెలిసిందే. మరోవైపు చైనా కూడా పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభంతో తమ కంపెనీలను రక్షించుకోవడం, చమురు దిగుమతులు, ప్రపంచ వాణిజ్య నెట్ వర్క్ ల కు సంబంధించిన రంగాలను బలోపేతం చేస్తోంది.. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో ఇరు దేశాలు తమ ఆధిపత్యాన్ని ఎలా కొనసాగిస్తాయనే దానికి ఈ సమావేశం ద్వారా ఓ రూపాన్ని ఇస్తుందని భావిస్తున్నారు.
The four red lines in #China–#US relations must not be challenged. #ChinaUSRelations #ChinaDiplomacy pic.twitter.com/4kmNeEWLGH
— Chinese Embassy in US (@ChineseEmbinUS) May 12, 2026