
రామ్ చరణ్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ ‘పెద్ది’ రిలీజ్ డేట్ దగ్గర పడింది. సినిమా విడుదలకు ఇంకా 3 వారాలే మిగిలి ఉంది. ఈ క్రమంలోనే మేకర్స్ వరుస ప్రమోషన్స్ చేయడానికి సిద్ధమయ్యారు. ఆ ప్రమోషన్స్ కూడా వినూత్నంగా ఉండేలా, దేశవ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ అయ్యేలా మేకర్స్ ప్లాన్స్ చేస్తున్నారు.
ఇందులో భాగంగా మే 18న ముంబయిలో గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా భారీ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ట్రైలర్ లాంచ్ తర్వాత, ఓ 5 రోజులు గ్యాప్ తీసుకుని మే 23న పెద్ది స్పెషల్ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నారు. ఈ క్రేజీ ఈవెంట్ని మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో నిర్వహించనునున్నారు.
MUMBAAAIIIII, Remember his name #PEDDI, he is coming 💥💥#PEDDI Trailer Takeover from May 18th, More details soon❤️🔥#PEDDI WORLDWIDE RELEASE IN CINEMAS ON JUNE 4th❤️🔥 pic.twitter.com/9EZfM1LnGV
— PEDDI (@PeddiMovieOffl) May 13, 2026
ఈ ఊరమాస్ మసాలా పాటలో రామ్ చరణ్‌తో కలిసి శ్రుతి హాసన్ స్టెప్పులేయనుందని టాక్ వినిపిస్తోంది. అలాగే, ఈ ఈవెంట్లో మ్యూజిక్ డైరెక్టర్ A. R. రెహమాన్ స్పెషల్ లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నట్లు ఇవ్వనున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఈ ఈవెంట్‌కు చరణ్, జాన్వీ కపూర్ కూడా హాజరవ్వడంతో పాటు స్టేజీపై స్టెప్పులు వేయనున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి,
#SoundOfPeddi will echo in BHOPAL from May 23rd💥💥
Get ready for vibe of the special song and Watch A R Rahman sir perform live❤️🔥❤️🔥
Peddi in cinemas worldwide on 4th June.#GetReadyForPeddi 💥💥 pic.twitter.com/llGdtvHFTm
— PEDDI (@PeddiMovieOffl) May 13, 2026
ఉప్పెన ఫేమ్’ బుచ్చి బాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాలో రామ్ చరణ్ గ్రామీణ క్రికెటర్‌తో పాటు కుస్తీ వీరుడిగానూ కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలు సోషల్ మీడియాలో భారీ స్పందన తెచ్చుకుని సినిమాపై నెక్స్ట్ లెవల్ బజ్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు ట్రైలర్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
దంగల్ గుర్తుకు రాకూడదు..
పెద్ది సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న వేళ, ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుస్తీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా చూసేటప్పుడు ప్రేక్షకులకు బ్లాక్ బస్టర్ దంగల్ గుర్తుకు రాకూడదనేదే తమ ముందున్న అతిపెద్ద సవాలుగా భావించామని తెలిపారు. అందుకే సెట్స్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని, కొత్తదనం చూపించే ప్రయత్నం చేశామని చెప్పారు. సినిమా చూసేటప్పుడు ఓ గొప్ప సినిమా చూస్తున్న ఫీలింగ్ ఇచ్చేలా తన వంతు కృషి చేసిన్నట్లు చెప్పారు.