Reading Time: < 1 minute
Karimnagar Jewellery Shop Shooting Five Armed Robbers Attack Pmj Jewellers 4 Injured

కరీంనగర్ లో కాల్పుల కలకలం రేపాయి. ప్రముఖ పీఎంజే జ్యువెల్లర్స్ షాపులోకి తుపాకులతో చొరబడ్డ ఐదుగురు దొంగలు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. భారీగా బంగారం ఆభరణాలు దోపిడీ చేసినట్లు సమాచారం. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన సమాచారం తెలియగానే కరీంనగర్ పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దొంగలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా తప్పించుకున్నారు అనే అంశాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌లను సేకరించి, దొంగల గుర్తింపుపై దృష్టి సారించారు. ఈ ఘటనతో నగరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది.