జ్యోతిష్య శాస్త్రంలో పౌర్ణమిలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ రోజు ప్రతి ఒక్కరూ నది స్నానం ఆచరించి పూజలు చేస్తుంటారు. అయితే మే1న వైశాఖ, బుద్ధ పౌర్ణమి. ఈరోజు చాలా విశిష్టమైన రోజు, అయితే ఈ పౌర్ణమి రాశులపై కూడా దాని ప్రభావం చూపుతుంది. బుధుడి అస్తమయం కొన్ని రాశుల వారికి వరాల జల్లు కురిపించబోతుంది. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?
వృషభ రాశి : పౌర్ణమి రోజు బుధుడి అస్తమయం వలన ఈ రాశి వారి జీవితంలో ఉన్న కష్టాలు అన్నీ తొలిగిపోతాయి. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. డబ్బుకు కూడా లోటు ఉండదు. వీరు చాలా ఆనందంగా గడుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తారు. వైవాహిక జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆనందకర జీవితం గడుపుతారు.
సింహ రాశి : సింహ రాశి వారికి ఈ పౌర్ణమి అదృష్టం తీసుకొస్తుందని చెప్పాలి. వీరు ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు. అంతే కాకుండా వీరికి కుటుంబ సభ్యుల నుంచి మంచి సపోర్టు లాభిస్తుంది. దీంతో వీరు అనుకున్న రంగాల్లో మంచిగా రాణిస్తారు. వైవాహిక జీవితం ఆనందంగా కొనసాగుతుంది. వీరికి అన్ని విధాలుగా ఈ మే నెల కలిసిరానున్నది.
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి బుధ గ్రహం అస్తమయం వలన అన్ని విధాలుగా కలిసి వస్తుంది. విద్యార్థులు టాప్ ర్యాంకులతో మంచి కాలేజీల్లో సీటు సంపాదిస్తారు. ఇంటిలో సానుకూల ఫలితాలు కలుగుతాయి. ఈ రాశి వారికి సమాజంలో తగు గుర్తింపు లభిస్తుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.
మకర రాశి : మకర రాశి వారికి వైశాఖ పౌర్ణమి వలన శుభ ఫలితాలు కలుగుతాయి. కళారంగంలో ఉన్నవారు అవార్డులు అందుకునే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు అందుకుంటారు. వీరికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్య గమనిక : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు




