
సింగర్ మంగ్లీ ఆరోపణలు ఎదుర్కొంటున్న మైక్రో ఫైనాన్స్ స్కామ్ కేసు ప్రకంపనలు రేపుతూనే ఉంది. బాధితులు రోడ్డెక్కుతుండటం, బాధితుల తరపున గిరిజన సంఘాల నేతలు పోరాటం చేస్తుండటం మరింత హీట్ పెంచుతోంది. అయితే.. తనపై వస్తున్న ఆరోపణలపై మంగ్లీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. మైక్రో ఫైనాన్స్ బాధితులకు అన్యాయం జరిగిందన్న మంగ్లీ..బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని ప్రకటించారు. కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని.. ఈ ఆర్థిక మోసంలో తనకుఎ ఎలాంటి ప్రమేయం లేదని చెప్పుకొచ్చారు.. ఈ సమయంలోనే.. తనపై పెట్టిన కేసుపై మరోసారి మంగ్లీ స్పందించారు. రమావత్ మధుపై విరుచుకుపడిన సింగర్ మంగ్లీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దుర్మార్గుడు అని తెలియక మాట్లాడిన పాపానికి.. పట్టుబడితే నా బ్యాండ్‌తో కలిసి ఇంటికెళ్లి భోజనం చేశానన్నారు. ఒకపూట భోజనం చేసిన పాపానికి క్షోభ అనుభవిస్తున్నా.. అంటూ పేర్కొన్నారు.
కొందరు కావాలనే ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారని మంగ్లీ పేర్కొన్నారు. ఏ ఆధారాలు లేకుండా తన చుట్టూ కుట్రలు పన్నుతున్నారని.. రమావత్ మధు చేసిన మోసాల్లో తనకు 1శాతంకూడా సంబంధం లేదన్నారు. ప్రజల్ని మోసం చేసి రక్తపు కూడు తినే మనిషిని కాదన్నారు. తన కుటుంబ సభ్యులకూ ఈ మోసంతో సంబంధం లేదన్నారు. బండి శివ పేరుని తన తమ్ముడు శివచౌహాన్‌గా ప్రచారం చేస్తున్నారన్నారు. పదే పదే అబద్దాన్ని వందసార్లు చెప్పి నిజం చేయాలనుకుంటున్నారని.. తాను.. తన కుటుంబ సభ్యులు ఎక్కడికీ పారిపోలేదని పేర్కొన్నారు. అంతిమంగా నిజమే గెలుస్తుంది అంటూ మంగ్లీ నోట్ విడుదల చేశారు.
మంగ్లీ నోట్..
ఇటీవల ఈ ఫ్రాడ్ కేసు బాధితుడు నల్గొండ జిల్లా పెద్దవూరకు చెందిన పాల్తి రమేష్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో మంగ్లీ నోట్ విడుదల చేసింది. రమావత్ మధు బాధితుడిగా అభివర్ణిస్తూ మంగ్లీ తాను విడుదల చేసి నోట్‌లో రాసుకొచ్చింది. ఆయన మృతి బాధాకరమని చెబుతోంది మంగ్లీ.
ఫైనాన్స్ స్కామ్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదు..
మరోవైపు మైక్రో ఫైనాన్స్ స్కామ్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు మంగ్లీ సోదరుడు శివ చౌహాన్.. మంగ్లీపై కుట్రపూరితంగానే ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అడ్వొకేట్ సుబ్బారావు ఆరోపణలు నిరాధారమన్నారు. ఈ కేసులో వాస్తవాలు ఏంటనేది పోలీసు విచారణలో తేలుతాయన్నారు. తమపై నిరాధార ఆరోపణలు చేసిన వాళ్లకు చట్టపరంగానే సమాధానమిస్తామని అంటున్నారు మంగ్లీ సోదరుడు శివ చౌహాన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..