Reading Time: 2 minutes
Central Government: దేశ ప్రజలకు బిగ్ న్యూస్.. మే 1 నుంచి మారనున్న రూల్స్.. కొత్తగా అమల్లోకి వచ్చేవి ఇవే..

మే 1వ తేదీ వచ్చేస్తోంది. ప్రతీ నెలా ఒకటో తేదీ వస్తుందంటేనే అనేక మార్పులు అమల్లోకి వస్తుంటాయి. ప్రజలను ఆర్ధికంగా ప్రభావితం చేసే మార్పులు జరుగుతాయి. వీటి గురించి ముందే అవగాహన కలిగి ఉండాల్సిన అవసరముంది. మే 1 నుంచి ప్రజలను ప్రభావితం చేసే మార్పులు రాబోతున్నాయి. ఎల్పీజీ గ్యాస్ నుంచి బ్యాంకింగ్ వరకు అనేక కొత్త రూల్స్ రాబోతున్నాయి. మీ నెలవారీ బడ్జెట్‌పై ప్రభావం చూపే వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు

ప్రతీ నెలా 1వ తేదీన గ్యాస్ ధరలు మారుతూ ఉంటాయి. కంపెనీలు గ్యాస్ ధరలను సవరిస్తూ ఉంటాయి. ప్రస్తుతం దేశంలో గ్యాస్ సరఫరాలో అంతరాయం ఉండటం, ఇరాన్ హర్ముజ్ జలసంధి తెరవడంపై ప్రకటన చేయకపోవడంతో అనిశ్చితి నెలకొంది. దీంతో గ్యాస్ రవాణాకు ఆటంకం కలుగుతుడటంతో గత రెండు నెలలుగా గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. దీంతో మే 1 నుంచి కూడా గ్యాస్ ధరలు పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ఇక అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు కూడా పెరిగాయి. దీంతో వచ్చే నెలలో గ్యాస్ ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే వరుసగా మూడు నెలలు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగినట్లు అవుతుంది. ఇక మే 1నుంచి గ్యాస్ సిలిండర్ బుకింగ్‌కు 25 రోజుల గ్రేస్ పీరియడ్ విధించనున్నట్లు తెలుస్తోంది.

అకౌంట్ నుంచి ఆటో డెబిట్

ఇక ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన వార్షిక ప్రీమియం మే నెలలో అకౌంట్ నుంచి ఆటో డెబిట్ కానుంది. దీంతో ఖాతాదారులు తమ అకౌంట్లో సరిపడ నిల్వలు ఉంచుకోవాలి. లేకపోతే పథకం నుంచి మిమ్మల్ని తొలగించే అవకాశముంది.

ఆన్‌లైన్ గేమింగ్ రూల్స్

మే 1 నుంచి కొత్త ఆన్‌లైన్ గేమింగ్ రూల్స్ రానున్నాయి. ఆన్ లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏర్పాటు కానుంది. గేమ్‌ల సర్టిఫికేషన్ చెల్లుబాటు అయ్యే కాలాన్ని 5 నుంచి 10 ఏళ్లకు పెంచారు. ఆన్ లైన్ గేమింగ్ రెగ్యూలేషన్ యాక్ట్-2025 ప్రకారం ఇకపై గేమింగ్ ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది.

కేవైసీ గడువు పూర్తి

బ్యాంక్ అకౌంట్లు ఉన్నవారు కేవైసీ అప్డేట్ చేసుకునేందుకు మే 1వరకు గడువు ఉంది. లేకపోతే బ్యాంక్ లావాదేవీలు, అకౌంట్ నిర్వహిచడంలో ఇబ్బందులు పడే అవకాశముంది. మొబైల్, నెట్ బ్యాంకింగ్ వంటి సేవలు నిలిచిపోయే అవకాశముంది. అలాగే ట్రైన్ టికెట్ క్యాన్సిలేషన్ రూల్స్ మే 1 నుంచి రానున్నాయి. ట్రైన్ బయల్దేరడానికి 8 గంటల ముందు క్యాన్సిల్ చేసుకోవాలి. ఆ తర్వాత క్యాన్సిల్ చేసుకుంటే రీఫండ్ రాదు.