Reading Time: 2 minutes
Genelia Dsouza Gets Emotional At Raja Shivaji Trailer Launch Breaks Down On Stage

Genelia D’Souza: ఇదివరకు టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన జెనీలియా (Genelia D’Souza) ముంబైలో జరిగిన ‘రాజా శివాజీ’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో తీవ్ర భావోద్వేగానికి లోనై స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె భర్త, నటుడు రితేష్‌ విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ (Riteish Deshmukh)కు సినిమా నిర్మాణంలో ఎదురైన కష్టాలను వివరించగా, ఆ మాటలు విని జెనీలియా వెక్కివెక్కి ఏడ్చారు.

200% వాల్యూమ్ బూస్ట్, 144Hz స్క్రీన్ + 7000mAh బ్యాటరీ.. బడ్జెట్‌లోనే POCO M8s 5G లాంచ్.!

ఈ కార్యక్రమంలో రితేష్ తన టీమ్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ.. తన విజన్‌కు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరిని అభినందించారు. ఈ సమయంలో పక్కనే నిలబడ్డ జెనీలియా అతని మాటలకు తీవ్ర భావోద్వేగానికి లోనైంది. ఒక దశలో రితేష్ ఆమెను “తనకు అతిపెద్ద బలం”గా అభివర్ణించడంతో ఆ మాటతో మరింత ఏడ్చేసింది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

‘రాజా శివాజీ’ చిత్రంలో అభిషేక్ బచ్చన్, విద్యా బాలన్, మహేష్ మంజ్రేకర్, భాగ్యశ్రీ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే సచిన్ ఖేడేకర్, ఫర్దీన్ ఖాన్, జితేంద్ర జోషి, అమోల్ గుప్తలు కూడా ఈ సినిమాలో నటించారు. అంతేకాదు జెనీలియా కూడా ఈ చిత్రంలో భాగమయ్యారు. ఇంకా ప్రత్యేకంగా సల్మాన్ ఖాన్ కూడా ఈ సినిమాలో కామియో పాత్రలో కనిపించనున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించలేదు గానీ, కథలో కీలక పాత్ర పోషిస్తారని రితేష్ అన్నారు. మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన మహారాజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత గాథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం యాక్షన్ సన్నివేశాలు, చారిత్రక నేపథ్యంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా మే 1న మహారాష్ట్ర డే సందర్భంగా విడుదల కానుంది.

Digital Vastu Tips: ఈ మూడు మీ మొబైల్‌ ఫోన్‌ నుంచి తొలగించండి.. అదృష్టం మారిపోతుంది..!

ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్, ముంబై ఫిలిం కంపెనీ నిర్మిస్తుండగా.. జ్యోతి దేశ్‌పాండే, జెనీలియా దేశ్‌ముఖ్ సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం మరాఠీ, హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.