Reading Time: < 1 minute
Kcr Appoints Jeevan Reddy As Brs Party General Secretary

మాజీ మంత్రి, సీనియర్ నేత టి. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరడం పట్ల అధినేత కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. జగిత్యాల వేదికగా జరిగిన భారీ బహిరంగ సభలో జీవన్ రెడ్డికి గులాబీ కండువా కప్పి ఆహ్వానించిన అనంతరం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సభా వేదికపైనే కేసీఆర్ ఒక కీలక ప్రకటన చేశారు. జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ఇప్పుడే ప్రకటిస్తున్నానని వెల్లడించారు. ఆయన అనుభవం, వ్యక్తిత్వం పార్టీకి దిశానిర్దేశం చేస్తాయని కేసీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Jeevan Reddy : రాష్ట్ర పునర్నిర్మాణం కేసీఆర్‌తోనే సాధ్యం

“జీవన్ రెడ్డి, నేను గత 40 ఏళ్లుగా మిత్రులం. రాజకీయాల్లో ఆయన ప్రయాణం ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. జగిత్యాల ప్రాంతం అంటే ఆయనకు ఎంతో ఇష్టం.. ఈ గడ్డ కోసం ఆయన ప్రాణం పెట్టి పనిచేశారు” అని కేసీఆర్ కొనియాడారు. జీవన్ రెడ్డికి కేవలం జగిత్యాలలోనే కాదు, చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కూడా మంచి పేరు , పట్టు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.

జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే ప్రజల స్పందన ఎలా ఉంటుంది అనే విషయంపై తాము సర్వేలు కూడా చేయించారని కేసీఆర్ వెల్లడించారు. ఆ సర్వేలన్నీ జీవన్ రెడ్డి రాకను ప్రజలు కోరుకుంటున్నారని స్పష్టం చేశాయని చెప్పారు. ఆయనతో పాటు పార్టీలో చేరిన ప్రతి ఒక్క కార్యకర్తను, నాయకుడిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. ఈ చేరికతో ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మరింత శక్తివంతంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

KCR : జీవన్ రెడ్డి కి గులాబీ కండువా కప్పి BRS లోకి ఆహ్వానించిన కేసీఆర్