Reading Time: < 1 minute
Rajasthan Pachpadra Refinery Fire Pm Modi Inauguration Details

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ అత్యాధునిక రిఫైనరీని ప్రారంభించడానికి సరిగ్గా 24 గంటల ముందు.. అక్కడ భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం కలకలం రేపింది. ఆకాశమంతా నల్లటి పొగలు కమ్ముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.  ఘటనా స్థలానికి చేరిన 20 ఫైర్ ఇంజిన్ల ద్వారా సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు.

ఇది దేశంలోనే మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ-కమ్-పెట్రోకెమికల్ కాంప్లెక్స్. దీనిని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL), రాజస్థాన్ ప్రభుత్వం సంయుక్త భాగస్వామ్యంతో నిర్మించాయి.  ఈ ప్రాజెక్టు ప్రస్థానం దశాబ్ద కాలం క్రితమే మొదలైంది. 2013లో అప్పటి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వ హయాంలో సోనియా గాంధీ దీనికి శంకుస్థాపన చేశారు. అప్పుడు దీని అంచనా వ్యయం సుమారు రూ.37,230 కోట్లు. 2018లో కేంద్రంలో ప్రభుత్వం మారిన తర్వాత, ప్రధాని మోదీ ఈ ప్రాజెక్టును మళ్లీ ప్రారంభించారు. కాలక్రమేణా పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా దీని వ్యయం రూ.73,000 కోట్ల పైచిలుకు చేరుకుంది.

ఈ రిఫైనరీ పెట్రోల్, డీజిల్ ఉత్పత్తికే పరిమితం కాకుండా, భారీ స్థాయిలో పెట్రోకెమికల్ ఉత్పత్తులను కూడా తయారు చేస్తుంది. పాలిప్రొపిలిన్, పాలిథిలిన్, బెంజీన్ వంటి రసాయనాలు ఇక్కడ ఉత్పత్తి అవుతాయి. ఇవి ప్లాస్టిక్ ఫర్నిచర్, అగ్రికల్చర్ పైపులు, ప్యాకేజింగ్ మెటీరియల్స్ , వైద్య పరికరాల తయారీకి ముడి సరుకుగా ఉపయోగపడతాయి.

ఈ కాంప్లెక్స్ చుట్టూ అనేక చిన్న , మధ్య తరహా పరిశ్రమలు ఏర్పడతాయి. దీనివల్ల వేలాది మంది స్థానిక యువతకు ఉపాధి లభిస్తుంది. విదేశీ దిగుమతులపై ఆధారపడటం తగ్గించి, దేశీయంగా ఇంధన లభ్యతను పెంచడం ద్వారా భారతదేశ ఇంధన భద్రతను ఇది బలోపేతం చేస్తుంది. మొత్తానికి, ఈ ప్రాజెక్టు రాజస్థాన్ రాష్ట్రాన్ని జాతీయ , అంతర్జాతీయ స్థాయిలో ఒక పారిశ్రామిక కేంద్రంగా నిలబెట్టనుంది. ప్రమాదాలు జరిగినప్పటికీ, దేశ ఆర్థిక వృద్ధిలో ఇది ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. ప్రస్తుతం ఘటనా స్థలంలో మంటలను