Reading Time: 2 minutes
Preity Zinta Hug Goes Viral Arshdeep Singhs Joy After Pbks Win In Ipl 2026

బాలీవుడ్ హీరోయిన్, పంజాబ్ కింగ్స్ ప్రాంచైజీ సహ యజమాని ప్రీతి జింటా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్‌లో పంజాబ్ జట్టును గెలిపించిన ఆటగాడికి ఓ హగ్ ఇస్తుంటారు. ఒకప్పుడు పంజాబ్ జట్టుకు ఆడిన యువరాజ్ సింగ్, క్రిస్ గేల్ లాంటి దిగ్గజాలకు సహా మరికొందరికి ప్రీతి హగ్ ఇచ్చారు. గతేడాది కూడా గెలుపు జోష్ లో చాలా మంది ఆటగాళ్లను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. కాస్త బిజీగా ఉన్న ప్రీతి జింటా.. ఐపీఎల్ 2026లో మ్యాచ్‌లకు హాజరుకాలేదు. ఆదివారం లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌కు హాజరై సందడి చేశారు.

లక్నోపై విజయం అనంతరం పంజాబ్ సహ యజమాని ప్రీతి జింటా మైదానంలోకి వచ్చి ఆటగాళ్లను అభినందించారు. ఈ క్రమంలో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను హగ్ చేసుకున్నారు. అర్ష్‌దీప్ ఆ క్షణాన్ని బాగా ఆస్వాదించాడు. ‘యాహూ.. ప్రీతి జింటా హగ్ ఇచ్చిందోచ్’ అంటూ ఎగిరి గంతేశాడు. దాంతో అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు. ప్రీతి కూడా ఇదేంటి అన్నట్లు చూశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సన్నివేశం జట్టు సభ్యుల మధ్య ఉన్న బంధాన్ని, యజమాన్యం-ఆటగాళ్ల మధ్య ఉన్న అనుబంధాన్ని స్పష్టంగా చూపించింది.

ఐపీఎల్‌ 2026లో పంజాబ్‌ కింగ్స్‌ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ సీజన్లో ఓటమి ఎరుగని జట్టు పంజాబ్ మాత్రమే. లక్నోను ఓడించడం ద్వారా మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో (11 పాయింట్స్) కొనసాగుతోంది. ఇదే ఊపుతో ముందుకు సాగాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రీతి జింటా తన జట్టుకు అందించే మద్దతు, ఆటగాళ్లలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపుతోందని ఈ వైరల్ వీడియో ద్వారా స్పష్టమైంది.