Reading Time: < 1 minute
Prakash Raj Faces Rs 100 Crore Defamation Suit Over Alleged Rama Remarks

Prakash Raj Faces Defamation Suit: శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు సినీ నటుడు ప్రకాష్‌ రాజ్‌.. అయితే, వీహెచ్‌పీ, బీజేపీ, హిందూ సంఘాలు ప్రకాష్‌ రాజ్‌పై తీవ్రస్థాయిలో మండిపుతున్నారు.. శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణులపై ఆయన చేసినట్లు ఆరోపిస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ నేత, టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రకాష్ రాజ్‌పై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తున్నట్లు ప్రకటించారు. కోట్లాది మంది భక్తులు ఆరాధించే శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణులపై ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఆయన మాట్లాడారని ఆరోపించారు.

Read Also: Hit and Run Case : జూబ్లీహిల్స్‌ హిట్‌ అండ్‌ రన్‌ కేసులో కీలక మలుపు

ప్రకాష్ రాజ్ ఇతర మతాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు భానుప్రకాష్‌ రెడ్డి. హిందూ దేవతలపై మాత్రమే విమర్శలు చేసి, భక్తుల భావోద్వేగాలను దెబ్బతీసి ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. అలాగే ప్రకాష్ రాజ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని చెప్పారు. హిందువులకు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సినిమాల్లో డైలాగులు చెప్పినట్లు బయట మాట్లాడితే ప్రజలు సహించరని హెచ్చరించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రకాష్ రాజ్ నుంచి ఈ అంశంపై స్పందన రావాల్సి ఉంది. మరోవైపు, వీహెచ్‌పీ సైతం ప్రకాష్‌ రాజ్‌కు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చిన విషయం విదితమే..