Reading Time: < 1 minute
Trump Warns Iran Attacks Us Iran Talks Islamabad

Donald Trump: అమెరికా-ఇరాన్ మధ్య రెండో రౌండ్ చర్చలు ఇస్లామాబాద్ వేదికగా సోమవారం నుంచి ప్రారంభమవుతాయని నివేదికలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే, చర్చలకు ముందు యథావిధిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ బెదిరింపులకు దిగారు. బుధవారం వరకు ఒప్పందం కుదరకపోతే మళ్లీ దాడులు ప్రారంభిస్తామని ఇరాన్‌ను హెచ్చరించారు. ప్రస్తుతం, అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ అమలులో ఉంది.

Read Also: Trump-China: హార్ముజ్ తెరుచుకోవడంపై జిన్‌పింగ్ చాలా సంతోషంగా ఉన్నారు.. త్వరలోనే చైనాకు వెళ్తానన్న ట్రంప్

ఈసారి డీల్ కుదరకపోతే కాల్పుల విరమణ పొడగించనని చెప్పారు. ఇరాన్ పోర్ట్స్‌పై నిర్బంధం కొనసాగుతుందని, అవసరమైతే మళ్లీ బాంబులు వేయడం ప్రారంభిస్తామని చెప్పారు. అరిజోనాలోని ఫీనిక్స్ నుండి వాషింగ్టన్‌కు తిరిగి వస్తున్నప్పుడు ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న చర్చలు కొలిక్కి రావడం లేదు. అమెరికా షరతులకు ఇరాన్ దిగిరావడం లేదు.

హార్ముజ్ జలసంధి, ఇరాన్ యురేనియం గురించి ప్రతిష్టంభన నెలకొంది. అయితే, హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడం ప్రపంచ దేశాలకు ఊరట కలిగించే అంశం. అయితే, జలమార్గాన్ని ఓపెన్ చేసినప్పటికీ, అమెరికా దిగ్బంధం కొనసాగితే మళ్లీ మూసేస్తామని ఇరాన్ హెచ్చరిస్తోంది.