Reading Time: < 1 minute
Gold Silver Prices Today India Silver Jumps 10000 Gold Rates Rise

వామ్మో.. వెండి, బంగారం ధరలు మళ్లీ షాకిస్తున్నాయి. పశ్చిమాసియా యుద్ధం సమయంలో ధరలు తగ్గుముఖం పట్టాయి. అయితే కాల్పుల విరమణ దగ్గర నుంచి హెచ్చుతగ్గులు అవుతున్నాయి. నిన్న భారీగా తగ్గిన ధరలు.. ఈరోజు మాత్రం హడలెత్తిస్తున్నాయి. కిలో వెండిపై రూ.10 వేలు పెరగగా.. తులం గోల్డ్‌పై రూ. 810 పెరిగింది. దీంతో సామాన్యులు మళ్లీ బెంబేలెత్తిపోతున్నారు.

ఇది కూడా చదవండి: Iran-US Talks: ఇరాన్-అమెరికా తదుపరి చర్చలపై అప్‌డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..!

సిల్వర్ ధర మళ్లీ దూకుడు పెంచింది. ఈరోజు కిలో వెండిపై రూ.10,000 పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,75, 000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.2,80,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగళూరులో మాత్రం కిలో వెండి ధర రూ.2,75, 000 దగ్గర అమ్ముడవుతోంది.

ఇది కూడా చదవండి: Mamata Banerjee: మమత ర్యాలీలో యువకుడు దుశ్చర్య.. హడలెత్తిపోయిన ముఖ్యమంత్రి

తులం గోల్డ్‌పై రూ.810 పెరగడంతో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,55,780 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.750 పెరగడంతో రూ.1,42,800 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.610 పెరగడంతో రూ.1,16,840 దగ్గర ట్రేడ్ అవుతోంది.