
Virat Kohli: జర్మన్ ఇన్‌ఫ్లూయెన్సర్ లిజ్‌లాజ్ ఫోటోకు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ లైక్ కొట్టడం వివాదంగా మారింది. దీని తర్వాత నెటిజన్లు విరాట్‌ను ట్రోల్ చేశారు. కోహ్లీ లైక్ చేసిన ఫోటో స్క్రీన్ షాట్ తెగవైరల్ అయింది. దీనిపై ఫ్యాన్స్ జోక్స్, మీమ్స్‌తో తెగ ట్రోల్ చేశారు. కోహ్లీ గతంలో చేసిన ‘‘అల్గారిథమ్ వల్ల లైక్ అయింది’’ అనే కామెంట్‌ను గుర్తు చేసుకుని ట్రోలింగ్ చేశారు. అయితే, ట్రోలింగ్, అనవసరమైన చర్చ పెరగడంతో ఆ తర్వాత అన్‌లైక్ చేశారు.
Read Also: Meta Lay Off: ఉద్యోగులకు మెటా షాక్.. వేల సంఖ్యలో తొలగింపు..
అయితే, ఈ వివాదంపై బ్యూటీ లిజ్ లాజ్ స్పందించారు. కోహ్లీ తన ఫోటోకు లైక్ చేయడం చూసి చాలా సంతోషించానని చెప్ంపింది. అయితే, ఆ తర్వాత అన్‌లైక్ చేయడం కొంచెం బాధగా అనిపించిందని చెప్పింది. ఇది ఇంత పెద్ద న్యూస్ ఎందుకు అయిందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. అయినా, తనకు సపోర్ట్ చేసినందుకు కోహ్లీకి థాంక్స్ చెప్పింది. కోహ్లీని ట్రోల్ చేయడం చూస్తే తనకు బాధగా ఉందని చెప్పింది.
కోహ్లీ తన ఫోటోకు లైక్ చేసినట్లు ముందుగా తెలియదని, సోషల్ మీడియా, ఇతర ప్లాట్‌ఫామ్‌లపై ఈ వార్త వైరల్ అయినప్పుడే తెలిసిందని ఆమె చెప్పారు. తనకు చాలా మెసేజ్‌లు వచ్చాయని, కోహ్లీ తన ఇమేజ్‌ను లైక్ చేయడం పట్ల ప్రజలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పింది. నేను నిద్ర లేచే సరికి అంతా నా గురించే వార్తలు వస్తున్నాయని చెప్పింది. కోహ్లీ లిజ్‌లాజ్ ఫోటోకు లైక్ చేసిన తర్వాత, ఆర్సీబీకి లిజ్‌లాజ్ మద్దతు ఇస్తున్న పాత వీడియో వైరల్ అయింది. తాను ఆర్సీబీ ఫ్యాన్ అని, గతేడాది నుంచే క్రికెట్ ఫాలో అవుతున్నట్లు చెప్పింది.