
Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి లక్నో హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ద్వంద్వ పౌరసత్వం కేసులో ఆరోపణలు ఎదుర్కొ్ంటున్న రాహుల్ గాంధీపై విచారణ జరపాలని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంజ్ శుక్రవారం తీర్పు చెప్పింది. ఈ విచారణను ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ లేదా కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించి జరిపించాలని ఆదేశించింది.
రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ తాను దాఖలు చేసిన పిటిషన్‌ను లక్నోలని ప్రత్యేక ఎంపీ/ఎమ్యెల్యే కోర్టు జనవరి 28న తిరస్కరించిందని, ఈ ఉత్తర్వుల్ని హైకోటర్లు సవాల్ చేసినట్లు బీజేపీ కార్యకర్త ఎస్ విఘ్నేష్ శిశిర్ చెప్పారు. తానున దాఖలు చేసిన పిటిషన్‌పై తాజా ఉత్తర్వులు వెలువడినట్లు వెల్లడించారు. ఆ సమయంలో పౌరసత్వంపై నిర్ణయం తీసుకునే అధికారం తమకు లేదని కింది కోర్టు పేర్కొంది.