Reading Time: < 1 minute
Prabhas Spirit Movie Non Theatrical Rights Business Updates

సాధారణంగా భారీ బడ్జెట్ సినిమాలకు షూటింగ్ దశలోనే థియేట్రికల్, నాన్-థియేట్రికల్ డీల్స్ క్లోజ్ అయిపోతుంటాయి కానీ ‘స్పిరిట్’ టీమ్ మాత్రం ఇందుకు భిన్నంగా వెళ్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు ఎలాంటి ఎక్స్టర్నల్ ఫైనాన్షియల్ బ్యాకింగ్ అవసరం లేదని సమాచారం. దీంతో నిర్మాతలు T-Seriesతో పాటు ప్రభాస్, సందీప్ వంగా ముగ్గురూ కలిసి ఒక కీలక నిర్ణయానికి వచ్చారు. డిజిటల్, శాటిలైట్ సహా ఇతర నాన్-థియేట్రికల్ హక్కులను ఇప్పుడే అమ్మకూడదని వారు గట్టిగా ఫిక్స్ అయ్యారు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి దిగ్గజ ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లు ఇప్పటికే భారీ ఆఫర్లతో మేకర్స్‌ని సంప్రదించినట్లు తెలుస్తోంది. సినిమా క్రేజ్ దృష్ట్యా రికార్డు స్థాయి ధరలను ఆఫర్ చేసినప్పటికీ, టీమ్ మాత్రం ససేమిరా అంటోంది.

Also Read :JD Chakravarthy: ‘చేతబడి’ చేస్తున్న జేడీ చక్రవర్తి!

సందీప్ రెడ్డి వంగా గత చిత్రం ‘యానిమల్’ సృష్టించిన సంచలనం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రభాస్‌తో కలిసి ఆయన చేస్తున్న ఈ ‘పోలీస్ డ్రామా’పై మార్కెట్‌లో విపరీతమైన హైప్ ఉంది. ఈ ఏడాది చివరలో సినిమా ఒక కొలిక్కి వచ్చిన తర్వాతే, మార్కెట్ వాల్యూ మరింత పెరుగుతుందని మేకర్స్ భావిస్తున్నారు. అప్పుడే డీల్స్ క్లోజ్ చేస్తే ఊహించని రేంజ్ బిజినెస్ జరుగుతుందని వారి ప్లాన్. ప్రస్తుతానికి ‘స్పిరిట్’ మేకర్స్ దృష్టంతా అవుట్‌పుట్ మీద మాత్రమే ఉంది. ఈ ఏడాది ఆఖరి వరకు ఎలాంటి బిజినెస్ డీల్స్ ఉండకపోవచ్చని స్పష్టమవుతోంది. అంటే, ప్రభాస్ ఫ్యాన్స్ ఈ భారీ ప్రాజెక్ట్ అప్‌డేట్స్ కోసం మరికొంత కాలం వేచి చూడాల్సిందే. ఒకవేళ డీల్స్ గనుక ఓపెన్ అయితే మాత్రం, ఇండియన్ సినిమా హిస్టరీలోనే అది ఒక సరికొత్త రికార్డు కావడం ఖాయం.