
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు నెమ్మదించిన వేళ బులియన్ మార్కెట్లు తిరిగి పుంజుకుంటున్నాయి. ఈ వారం ప్రారంభం నుంచి పరిస్థితులు సానుకూలంగా మారుతున్న వేళ బంగారం, వెండి లోహాల ధరలు తిరిగి పెరగటం రిటైలర్లను నిరాశకు గురిచేస్తున్నప్పటికీ.. ఇన్వెస్టర్లు మాత్రం తిరిగి పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం అవుతున్నారు. ఆభరణాలు షాపింగ్ చేయాలనుకుంటున్న తెలుగు ప్రజలు తమ నగరాల్లో పెరిగిన ధరలను పరిశీలించటం ముఖ్యం.
ఏప్రిల్16న బంగారం రేట్లు పెరిగాయి. ఏప్రిల్ 15 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.22 పెరిగింది. అయితే హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 557గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 260గా కొనసాగుతోంది.
గురువారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. ఏప్రిల్16, 2026న దేశవ్యాప్తంగా రేటు స్థిరంగా కొనసాగుతోంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి ఎలాంటి మార్పులు లేకుండా రూ.2లక్షల 75వేల వద్ద కొనసాగుతోంది. అంటే గ్రాము ధర రూ.275గా అమ్మకాలు జరుగుతున్నాయి.