Reading Time: < 1 minute
Samyuktha Menon Black Gold Movie Mancherial Shooting Struggles

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ సంయుక్త మీనన్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం ‘బ్లాక్ గోల్డ్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అయితే, తాజాగా ముగిసిన మంచిర్యాల షెడ్యూల్‌లో ఎదురైన చేదు అనుభవాలను, తన టీమ్ పడ్డ కష్టాన్ని తలుచుకుంటూ సంయుక్త సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. సినిమా గ్లామర్ వెనుక ఎంతటి కష్టం ఉంటుందో సంయుక్త మాటల్లో స్పష్టమైంది.

Also Read : Sundeep Kishan: సందీప్ కిషన్ ‘పవర్‌ పేట’ షురూ.. అదిరిపోయే టైటిల్ పోస్టర్ అవుట్!

‘మంచిర్యాల మమ్మల్ని అన్ని విధాలా పరీక్షించింది. 40 నుంచి 45 డిగ్రీల మండుతున్న ఉష్ణోగ్రతల మధ్య పని చేయడం మామూలు సవాలు కాదు. వేడి, అలసట మమ్మల్ని వేధించినా.. మా టీమ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. అంకితభావంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు’ అని సంయుక్త కొనియాడారు. డీహైడ్రేషన్ బారిన పడకుండా తన పర్సనల్ టీమ్ తీసుకున్న జాగ్రత్తలు, దర్శకుడు యోగి ఇచ్చిన ధైర్యం వల్లే తాను ఆ ఎండలను తట్టుకోగలిగానని ఆమె పేర్కొన్నారు. శారీరకంగా, మానసికగా ఎంతో సవాలుతో కూడుకున్న ఈ షెడ్యూల్ పూర్తి కావడంతో సంయుక్త నేరుగా తిరుపతి చేరుకున్నారు.

తిరుమల వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకున్న ఆమె.. తనకు అండగా నిలిచిన నిహారిక, పార్ధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎంత ఎనర్జీతో షూటింగ్‌కు వెళ్లానో, అంతే ఎనర్జీతో తిరిగి వస్తున్నానని చెబుతూ తిరుమల కొండపై దిగిన ఫోటోలను షేర్ చేశారు. అయితే ఈ మూవీ సింగరేణి నేపథ్యంలో లేదా బొగ్గు గనుల బ్యాక్‌డ్రాప్‌లో ‘బ్లాక్ గోల్డ్’ కథ సాగనుందని సమాచారం. అందుకే మంచిర్యాల వంటి ప్రాంతాల్లో ఈ కఠినమైన షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. సంయుక్త పడుతున్న ఈ కష్టం చూస్తుంటే, ఈ సినిమా కూడా ఆమె కెరీర్‌లో మరో హిట్ అవ్వడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.