Reading Time: < 1 minute

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు స్పీడప్ చేయాలి: భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ అంకిత్

Caption of Image.

సుజాతనగర్, వెలుగు : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యతతోపాటు వేగంగా పూర్తి చేయాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. సుజాతనగర్ మండలం మర్రి తండ గ్రామంలో ఇళ్ల నిర్మాణాలను బుధవారం ఆయన పరిశీలించారు. గ్రామానికి మంజూరైన 99 ఇళ్లలో 65 ఇళ్లు పూర్తవగా, మిగతావి వివిధ దశల్లో కొనసాగుతున్నాయని అధికారులు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లబ్ధిదారుల ఇళ్లను సందర్శించి పనుల పురోగతిని, నిర్మాణ నాణ్యతను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడిన కలెక్టర్, ఇప్పటివరకు ఖర్చు అయిన మొత్తం, ప్రభుత్వం విడుదల చేసిన నిధులు, అదనంగా వారు పెట్టిన ఖర్చు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయనవెంట తహసీల్దార్ కృష్ణ ప్రసాద్, ఎంపీడీవో భారతి, గృహ నిర్మాణ శాఖ ఏఈ లాల్ సాబ్, అధికారులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.