Reading Time: < 1 minute

ఇరాన్‎కు చైనా ఆయుధాలు పంపదు.. జిన్‌పింగ్‌ నన్ను ఆప్యాయంగా హగ్ చేసుకుంటడు: ట్రంప్

Caption of Image.

వాషింగ్టన్: ఇరాన్‎కు చైనా ఆయుధాలు పంపుతోదన్న వార్తలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌కు ఆయుధాలు ఇవ్వబోమని చైనాకు తమకు హామీ ఇచ్చిందని తెలిపారు. ఇరాన్ కు ఆయుధాలు సరఫరా చేయడాన్ని చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ తీవ్రంగా ఖండించారన్నారు. ఈ మేరకు ఇరాన్‎కు ఆయుధాలు సరఫరా చేయొద్దని జిన్ పింగ్‎కు తాను ఒక లేఖ రాశానని ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఇరాన్‎కు ఆయుధాలు పంపమని జిన్‌పింగ్ తనకు ప్రత్యుత్తరం ద్వారా హామీ ఇచ్చారని తెలిపారు. 

ప్రపంచదేశాల కోసం చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్‌ జలసంధిని తెరిచి ఉంచామని.. భవిష్యత్‌లో మళ్లీ ఇలాంటి పరిస్థితి రాదని పేర్కొన్నారు. హోర్ముజ్ జలసంధిని శాశ్వతంగా తెరుస్తున్నందుకు చైనా చాలా సంతోషంగా ఉందన్నారు. త్వరలో చైనాలో పర్యటిస్తానని.. జిన్‌పింగ్‌ నన్ను ఆప్యాయంగా కౌగిలించుకుంటారని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ట్రంప్. 

ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ వంటిదైనా హార్మూజ్ జలసంధిని అమెరికా దిగ్బంధించిన విషయం తెలిసిందే. ఇరాన్కు చెందిన ఓడరేవులను అమెరికా నేవీ బలగాలు చుట్టుముట్టాయి. అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా నౌకాదళం హార్మూజ్ జలసంధిలో భారీగా బలగాలను మోహరించింది. హార్మూజ్ జలసంధి మీదుగా ఇరాన్ ఓడరేవుల్లోకి వచ్చిపోయే నౌకలను అమెరికా దళాలు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నాయి.

హార్మూజ్ జలసంధిలో రాకపోకలు సాగించాలంటే ఏ దేశమైనా సరే తమ అనుమతి తీసుకోవాలని అమెరికా ఫోర్సెస్ తేల్చి చెబుతున్నాయి. ఒకవైపు ఇరాన్ దళాలు మరోవైపు అమెరికా బలగాలు చుట్టుముట్టడంతో హార్మూజ్ జలసంధి దగ్గర గంభీర వాతావరణం అవరించింది. అమెరికా దళాలు హార్మూజ్ జలసంధిని బ్లాకేడ్ చేయడాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకించింది. 

హార్మూజ్ జలసంధిపై నియంత్రణ ఇరాన్‎దేనని.. హార్మూజ్‏ను బ్లాక్ చేయడానికి అసలు అమెరికాకు ఏం హక్కు ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా తీరు ఇలా ఉంటే ట్రంప్ తాజా వ్యాఖ్యలు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. హార్మూజ్ విషయంలో అమెరికా నిర్ణయంపై చైనా సంతోషంగా ఉందని ట్రంప్ అనడం గమనార్హం. 

  
 

©️ VIL Media Pvt Ltd.