Reading Time: < 1 minute

కదిరిలో ఘోర ప్రమాదం.. నల్ల మందు ఇంట్లో పేలి.. నలుగురు కూలీలు మృతి

Caption of Image.

కదిరి: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలం కుమ్మర వాండ్లపల్లిలో ఘోర ప్రమాదం జరిగింది. తెలంగాణకు చెందిన కొంతమంది రాళ్లు పగలగొట్టే నల్ల మందు (జలటిన్ స్టిక్స్) ఇంట్లో స్టాక్ పెట్టుకోవడంతో వేడికి ఒక్కసారిగా పేలింది. రెప్పపాటులోనే మంటలు చుట్టుపక్కల వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఓ మహిళతో పాటు మరో ముగ్గురు మృతి చెందారు. పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. పేలుడు పదార్థాలు ఉన్న ఇల్లు పూర్తిగా దగ్ధమైంది.

తెలంగాణకు చెందిన కొందరు కదిరి చుట్టుపక్కల రాళ్లు కొట్టి జీవనం సాగిస్తున్నారు. ఇంట్లో నల్ల ముందు పేలడంతో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. కదిరి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్రంగా గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. మృతుల బంధువుల రోదనలతో కదిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి విషాద నిలయంగా మారింది.

ALSO READ : హైవేలపై ఓవర్ లోడ్ వాహనాలకు చుక్కలే..

©️ VIL Media Pvt Ltd.